వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది కోర్టు.. వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో నలుగురు నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండడంతో.. వర్చువల్ గా నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.. దీంతో, మార్చి 11వ తేదీ వరకు వల్లభనేని వంశీ సహా నిందితుల రిమార్డ్ పొడిగించారు.. మరోవైపు.. వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు..
మాజీ సీఎం జగన్ తీరు పై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించడం మంచి సంప్రదాయం కాదన్నారు.. సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు అని స్పష్టం.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు..
ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి…
అన్నమయ్య జిల్లాలో విషాదయం చోటు చేసుకుంది.. ఓబులవారిపల్లి మండలం వై కోట గుండాల కోన సిద్దేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు.. అయితే, క్షేత్రానికి వెళ్తున్న భక్తులపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసింది.. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
శివరాత్రి 2025ను పురస్కరించుకుని ప్రత్యేక పాటను ఆవిష్కరించింది వనిత టీవీ.. "దేవ దేవ శంకర దేవ శంభో శంకరా.. దేవులాడినేడదొరకవా..! ఆది ఆది శంకరా యాడతిరుగుతున్నవు.. జాడతెల్వకున్నవేందిరా..!! నిప్పుగాని నిప్పువు.. నీడగాని నీడవు.. మూఠలేని ముల్లెవు ఏ మిచ్చినా ఒల్లవు..!!! అన్ని ఉండి ఏమీ లేని అదిభిక్షువున్నవు..!!! అంటూ ప్రముఖ రచయిత, సింగర్ గోరేటి వెంకన్న రాయడంతో పాటు తన గొంతు సవరించారు..
వల్లభనేని వంశీనీ నేడు కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ నిమిత్తం వంశీ సహా మరో ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. అనుమతించింది కోర్టు.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వంశీని విచారించనున్నారు పోలీసులు.. ఈ నెల 27వ తేదీతో వల్లభనేని వంశీ మోహన్ పోలీస్ కస్టడీ ముగినుంది..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది..
శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. ఎమ్మెల్యే కూన రవి కుమార్ సభలో ధన్యవాదాలు తీర్మానాన్ని ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగం పై చర్చ జరుగుతుంది.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.. ఇక, శాసన మండలిలో ఏపీ ఎంఆర్డీ సవరణ ఆర్డినెన్స్ మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది.. శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు ప్రసంగిస్తారు.