తెలంగాణలో ఎన్టీవీ కథనం సంచలం సృష్టించింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈటల అనుచరులు తమను బెదరించి భూములు లాక్కొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లో ఇది వెలుగు చూడగా.. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని […]
ఆయనో బీసీ మంత్రి…. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే.. వారి అసైన్డ్ భూములపై కన్నేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు.. నాయానో భయానో భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డుగోలుగా వాడుకున్నాడు. మంత్రి దర్పాన్ని.. భూములు కాజేసేందుకు పేదలను భయపెట్టేందుకు వాడుకున్నాడు. కోళ్ల ఫామ్‌ల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు. అతనే తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్. ఆయన భార్య జమున పేరుతో హ్యాచరీస్ వ్యాపారం […]
మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే, చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండడంతో.. ఇప్పుడే మా వళ్ల కాదంటూ చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి.. ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కాగా, పెద్ద సంఖ్యలో యూత్ రిజిస్ట్రేషన్ చేసుకునే పనిలో పడిపోయారు.. వారి తాకిడికి సర్వర్లే మోరాయించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పట్లో సాధ్యం […]
కోవిడ్ రోగుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర చాలా కీలకమైనది.. ఆక్సిజన్ సరైన సమయం అందక.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు వదిలారు.. అయితే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్ అయ్యింది.. దీంతో.. కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు రిస్క్‌లు పడ్డాయి.. మరోవైపు ఆక్సిజన్ లీకేజీని అరికట్టడానికి ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. దాదాపు గంటన్నర నుంచి అదుపులోకి రావడం లేదని చెబుతున్నారు.. ఇక, ఈ పరిస్థితి స్వయంగా సమీక్షిస్తున్నారు పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ హిమన్సు […]
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్తే.. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్డౌన్, మినీ లాక్డౌన్, నైట్ కర్ప్యూ.. ఇలా పేరు ఏదైనా.. కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి. ఇక, కోవిడ్ సేకవండ్ వేవ్ నేపథ్యంలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం కీలక నిర్ణయం తీసుకుంది.. రేపటి (మే 1వ తేదీ) నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. భక్తులు ఎవరూ దర్శనానికి రాకూడదని మఠం అధికారులు కోరారు.. […]
ఇది కరోనా కాలం.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, తమకు అందుబాటులో ఉన్నపీహెచ్సీ ఏది..? ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి..? మరెక్కడ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది.. తెలిసినవారిని అడిగి వాకాబు చేయాల్సిన పరిస్థితి.. అయితే, ఈ కష్టాలకు చెక్.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొబైల్ యాప్‌లో ఈ […]
ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రత్యేక ఆఫర్లు తెస్తూనే ఉంటాయి.. పండగల సీజన్ వచ్చినా.. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తున్నా.. ముందే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు.. తాజాగా.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభిస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మే 2 నుంచి మే 7వ తేదీ వరకు కొనసాగనుంది ఈ ప్రత్యేక సేల్.. ఇక, ప్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అయితే, ఒకరోజు […]
సోషల్ మీడియాలో పోస్టులు.. వాటిపై పోలీసులు కేసులు పెట్టడంపై సీరియస్‌గా స్పందించింది సుప్రీంకోర్టు.. కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే.. పోలీసులు కేసులు పెడతారా? అని నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇకపై సహించబోమని స్పష్టం చేసింది.. ఇకపై ఎవరైనా వేధిస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా భావిస్తామని వ్యాఖ్యానించింది జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. ఒక వ్యక్తిగా, జడ్జిగా ఈ విషయం నాకు ఆందోళన కల్గిస్తోంది.. ఒక వ్యక్తి తన బాధను సోషల్ […]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు… డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను వినియోగించుకునే వీలు కల్పించింది.. మిగతా టీకాలను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు.. కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ […]