కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఇది భారత్ కోవిడ్ వేరియంట్ అంటూ కథనాలు వచ్చాయి.. చాలా మంది నేతలు విమర్శలు చేశారు.. అయితే, ఈ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది.. అంతేకాదు.. అది భారత్ వేరియంట్ అంటూ ఉండే కంటెంట్ మొత్తం తొలగించాలంటూ.. అన్ని సోషల్ మీడియా సంస్థలను కోరింది. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని, […]
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పో్యి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి పేర్లతో రూ.10 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, అందులో భాగంగా.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులను ఇప్పటి వరకు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్లపై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన […]
కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని రాష్ట్రాలను మాత్రం ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది.. దీంతో.. కరోనా కట్టడికి కోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నాయి ఆయా రాష్ట్రాలు.. తాజాగా, తమిళనాడు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది.. జూన్ 7 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది తమిళనాడు సర్కార్.. ప్రస్తుత లాక్డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు ఉదయం 7 గంటల […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి కోసం కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది.. ఈ నెల 5వ తేదీన ఏపీలో కర్ఫ్యూ ప్రారంభించగా.. కొత్త కేసులు కంట్రోల్ కాకపోవడంతో.. కర్ఫ్యూను మరింత టైట్ గా అమలు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కేసుల తీవ్రతను బట్టి లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు.. తాజాగా, కరోనా కేసుల కట్టడికి అనంతపురం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది… […]
కరోనా మహమ్మారి ఓ వైపు కల్లోలం సృష్టిస్తే.. మరోవైపు.. అదే అదునుగా అందినకాడికి దండుకుంటూ.. సామాన్య, మధ్య తరగతి ప్రజల ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి 66 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు అందగా.. అన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఇక, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలను ప్రారంభించింది సర్కార్… బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఇక […]
తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.3,439. కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. 43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. మాట్లాడుతూ.. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదన్నారు.. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేనని.. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జిల రూపంలోనే అన్నారు హరీష్‌రావు.. గత బడ్జెట్లో కేంద్ర […]
కోరోనా మహమ్మారిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ముగిసింది… నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.. ఆ మందుపై ఆయుష్ కమిషనర్ రాములు వివరాలు తెలియజేశారు.. ఇప్పటికే ఆనందయ్య మందు పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయన్న ఆయన.. రేపు చివరి నివేదిక రానుందన్నారు.. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.. ఇక, కేంద్రం సంస్థ సీసీఆర్ఏ అధ్యయన నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం […]
కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.. ఈ చర్యకు పూనుకున్న తర్వాతే కేసులు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు.. అయితే, లాక్డౌన్ పెట్టుకోవాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. జూన్ 30వ తేదీ వరకు లాక్డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. కానీ, నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలే అన్నారు.. ఇక, ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ముక్కుపిండి ఫీసులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. ఆస్తులు అమ్మి బిల్లులు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది.. కరోనా నేపథ్యంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.. దీని కోసం త్వరలోనే కొత్త పాలసీని కూడా తీసుకువస్తోంది ఏపీ సర్కార్.. ఇవాళ కోవిడ్ పై సమీక్ష సీఎం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలని అధికారులకు సూచించారు.. జిల్లా ప్రధాన కేంద్రాలు, ఆ జిల్లాల్లోని నగరాల్లో […]