Arasavilli temple: అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. సూర్యనారాయణ స్వామి ఆలయంలోని స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి లేలేత భానుడి కిరణాలు.. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకున్న భక్తులు.. ఆనందం వ్యక్తం చేశారు.. ఇక, ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు.. సుమారు 6 నిమిషాలు పాటు స్వామి వారి పాదాలు నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ కనిపించింది.. 1, 2 తేదీల్లో విజయదశమి శవన్నవరాత్రులు కావడంతో సూర్యకిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకిన నేపథ్యంలో భారీగా తరలి వచ్చారు భక్తులు.. కాగా, ప్రతీ ఏటా ఉత్తరాయణం, దక్షిణాయనం అక్టోబర్ 1, 2 తేదీల్లో.. మార్చి 9, 10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామి వారి పాదాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది.. మొత్తంగా స్వామివారి మూల విరాట్‌ను స్పృశించని కిరణ దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం పర్యంతమయ్యారు. ఉదయం 6 గంటల తర్వాత 6 నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాన్నం భక్తులకు కనువిందు చెసింది. ఆ సమయంలో స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు..
Read Also: Sabari – Godavari Floods: శబరి – గోదావరి నదుల ఉధృతి.. 100 గ్రామాలకు రాకపోకలు బంద్..!