Deputy CM Pawan Kalyan visit: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో అనుమానాస్పద కదలికలు..! వైసీపీ నేతను విచారించిన ఎస్పీ..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో అనుమానాస్పద కదలికలు..
- వైసీపీ నేత నరసింహను ప్రశ్నించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan visit: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఈ మధ్యే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.. అయితే, పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది.. దీనిపై జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన నరసింహ అనే వ్యక్తిని విచారించారు జిల్లా ఎస్పీ.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నరసింహ.. తాను రైతు గానే పవన్ కల్యాణ్.. రైతుల సమావేశానికి వచ్చానని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. కాగా, 50 మంది వైసీపీ నేతలకు రైతుల సమావేశానికి పాస్ లు ఇచ్చారట స్థానిక ఎమ్మెల్యే.. మొత్తంగా పవన్ పర్యటనలో అనుమానాస్పద కదలికలపై వైసీపీ కార్యకర్త నరసింహను ప్రశ్నించిన పోలీసులు.. అవసరమైతే మళ్లీ పిలుస్తామని నరసింహకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఇక, తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి 50 సార్లు రక్తదానం చేశానని పోలీసుల విచారణలో నరసింహ తెలిపినట్టుగా తెలుస్తుంది..
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల 26వ తేదీన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు.. ఆ సందర్భంలో ఒక అపరిచిత వ్యక్తి పవన్‌కు అనుమానాస్పదంగా చేరువయ్యాడు అని జనసేన పార్టీ వర్గాలు చెపుతున్నాయి. శంకరగుప్తం ప్రాంతంలో డ్రెయిన్ లీకేజ్ వల్ల నష్టపోయిన కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలోనూ.. అధికారులతో మాట్లాడుతున్న సమయంలోనూ.. తర్వాతి కార్యక్రమాల వరకు కూడా ఆ వ్యక్తి డిప్యూటీ సీఎంకు చాలా దగ్గరగా తిరిగినట్లు వీడియోల్లో కనిపించింది. సదరు వ్యక్తి రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త అని డిప్యూటీ సీఎం కార్యాలయానికి సమాచారం చేరింది. అతడి వ్యవహారం, కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని అధికారులు భావించారు. ఈ మొత్తం విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి డిప్యూటీ సీఎం కార్యాలయం తీసుకెళ్లింది. కార్యక్రమానికి ఎలా వచ్చాడు. ఎవరూ ఇచ్చిన పాస్‌తో వచ్చాడు.. అతని కదలికల్లో ఏం అనుమానం ఉందో అన్ని వివరాలు ఎస్పీకి అందజేశారు. విషయంపై తగిన విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. అయితే, ఆ తర్వాత నరసింహను విచారించి పంపించారు పోలీసులు
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!