అమరావతిపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే ఖర్చు తక్కువ అవుతుందన్నారు.. అయితే, ఇంతకు ముందు అమరావతిని రాజధానిగా తీసేస్తామని మేం అనలేదన్నారు.. అమరావతిని కలుపుకొని ఢీసెంట్రలైజ్ అన్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నాం.. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు..
హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు..
ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు.
ఏపీకి చెందిన మరో 44మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్న వార్తలు కలవరపెడుతున్నాయి.. నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్రకు వెళ్లి , నేపాల్ లో చిక్కుకున్నారు 44 మంది యాత్రికుల బృందం.. దీంతో, మంత్రి ఫారూఖ్ ను ఆశ్రయింయారు యాత్రికుల కుటుంబ సభ్యులు.. వెంటనే హోంమంత్రి అనిత , జిల్లా కలెక్టర్ రాజకుమారితో మాట్లాడిన మంత్రి ఫరూక్.. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు..
పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.. రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్‌కు అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలు కనడుతున్నాయా? అని ప్రశ్నించారు..
విజయవాడలో కోర్టు వద్ద మరోసారి హల్చల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఏపీ మద్యం స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన.. అప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతీసారి.. ఏదో హల్ చల్ చేస్తూ వస్తున్నారు.. అయితే, తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మీడియాలో కూడా ఇష్ట రీతిన అసత్య వార్తలు రాస్తున్నారని.. వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు చెవిరెడ్డి.. తానెప్పుడూ మద్యం వ్యాపారం…
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. మనసు ఒక చోట మనిషి మరో చోట అన్నట్టు ఉంది అయన పరిస్థితి. ప్రస్తుతం ఆయన తనలో తాను స్ట్రగుల్ అవుతున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట పరిశీలకులకు. తానొకటి తలుస్తుంటే వెనకున్న శక్తులు మరోటి చేస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇక్కడి నుంచి స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఇక 2014లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి వచ్చి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారాయన. కోడెల అకాల మరణంతో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. ఆ పోస్ట్ కోసం పోటీ కూడా ఓ రేంజ్లో నడిచింది.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా 2024లో వైసీపీ ఓటమికి చాలా రీజన్సే ఉన్నాయి. 40 శాతం ఓట్లు ఉన్నా... ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు తెచ్చుకోలేక 11కే పరిమితం అయింది. పార్టీకి డిజాస్టర్ ఫలితాలు వచ్చినా...వెంటనే తేరుకున్న అధ్యక్షుడు జగన్... తిరిగి ట్రాక్ ఎక్కించే పని మొదలుపెట్టారు. రకరకాల స్టేట్మెంట్స్, కార్యక్రమాలతో... ఫస్ట్ కేడర్‌లో ధైర్యం నింపగలిగారు.