Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నిన్నటికి నిన్న పార్టీ శ్రేణులకు షాకిస్తూ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఈ రోజు కీలక కామెంట్లు చేశారు.. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు.. రాజకీయాల్లో నేను, నా కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదు.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని నేను అభినందిస్తానని తెలిపారు.. వైసీపీ […]
CM YS Jagan: చంద్రబాబు పేదల ఇళ్ళను సమాధి కట్టే స్థలం అంటాడు.. శ్మశానాలతో పోల్చిన చంద్రబాబుకు మానవత్వం ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇళ్ళు లేని పేదలకు ఎంత ఆవేదన ఉంటుందో అన్న స్పృహ అయినా చంద్రబాబుకు ఉందా? అని ఫైర్ అయ్యారు.. ఒక పక్షి కూడా సొంతంగా ఒక గూడు కట్టుకుని తన కుటుంబంతో ఉంటుంది.. కానీ, పేదల ఇళ్ళను అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం […]
బంగారం ఎప్పుడైనా బంగారమే. ఈ విషయం జనానికి మరో సారి బాగా తెలిసొచ్చింది. దాచుకోడానికి బంగారాన్ని మించిన సాధనం మరొకటి లేదని అర్థమైంది. 2 వేల రూపాయల నోట్లను RBI చెలామణి నుంచి తొలగించడంతో. కరెన్సీ నోట్ల రూపంలో దాచుకోవడం ఎప్పటికైనా ఇబ్బందేనని తెలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో చిత్తు కాగితాలుగా మారిపోబోతున్న 2 వేల రూపాయల నోట్లను బంగారంలోకి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు RBI ప్రకటించిన వెంటనే.. బంగారం […]
రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. ఎండల ఎఫెక్ట్ అలా ఉంది మరి..! రాత్రి నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. .కానీ, ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఉపసమనం కోసం వైన్ షాపులకు పరిగెడుతున్నారు మందుబాబులు. బీరు తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొండుతున్నారు. ఫలితంగా మద్య అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలంగాణలో పక్షం రోజుల్లో 35 లక్షల కాటన్లు ఖాళీ అయ్యాయి. ఈ నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో బీర్లు అమ్మకాలు జరిగాయి. 18 […]
Withdrawal of Rs 2,000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.. సెప్టెంబర్ 30 నాటికి రూ. 2,000 బ్యాంకు నోట్లు చాలా వరకు తిరిగి ఖజానాకు వస్తాయని మేం భావిస్తున్నాం అని తెలిపారు.. రూ. 2,000 నోట్ల […]
బందరు పోర్టు చిరకాల స్వప్నం, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్ చేశామని తెలిపారు.. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేసిన ఆయన.. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు.. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆకాంక్షించారు ఏపీ ముఖ్యమంత్రి.
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వెకేషన్ బెంచ్ జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్ న్యాయవాది మెన్షన్ చేశారు. అయితే, పిటిషన్ తమ ముందుకు విచారణకు రావట్లేదని.. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు […]
Perni Nani Political Retirement: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు పనులను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పేర్నినాని.. సభా వేదిక పై నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.. వయస్సులో చిన్నవాడు అయిపోయాడు.. లేదంటే సీఎం వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేసి ఉండేవాడిని అని వ్యాఖ్యానించారు.. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని […]
Ketu Viswanatha Reddy is no more: ప్రముఖకవి, రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 88 ఏళ్లు.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిట్లో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల సమయంలో కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు విడిచారు విశ్వనాథ్ రెడ్డి.. రచయితలు, సాహితీవేత్తలు, కవుల సందర్శనార్థం ఈరోజు ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు.. అమెరికాలో ఉన్న తన కుమారుడు ఈ రోజు […]