Hot Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. రేపు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు విరుచుకుపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. రేపు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7, అల్లూరి […]
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. దీని కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్.. ఎన్టీఆర్ జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు.. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా ఎ.కొండూరులో తాగునీటి సరఫరా గురించి లంబాడి తండా వాసులతో మాట్లాడారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీప్రవీణ్ పవార్… అయితే, తమకు రెండు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తున్నాయంటూ కేంద్రమంత్రి ఎదుట వాపోయారు తండావాసులు.. ఇక, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారిని వివరణ కోరగా.. తాగునీటికి ఇబ్బంది లేదని అనడంతో కేంద్ర […]
చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయన్నారు.. పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్‌షీట్ అని ఫైర్ అయ్యారు.. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు.. సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇక, ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన […]
Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ భారీగా పెరగబోతోంది.. రేపట్నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు అమల్లోకి రాబోతున్నాయి.. భూముల మార్కెట్ ధరలను సవరించే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం చేరవేసింది ప్రభుత్వం.. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని చోట్లే భూముల […]
Elon Musk : ఏడాదికేడాదికి టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. గత 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీకి.. గత 5 ఏళ్ల నాటి టెక్నాలజీకి.. నేటి టెక్నాలజీకి ఎంతో తేడా ఉంది. ప్రతి ఏడాది టెక్నాలజీలో కొత్త ధనం వస్తూనే ఉంది. అందులో భాగంగా బ్లాక్ చైన్ నుంచి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) స్థాయికి ఎదిగాం. ఇక ఇప్పుడు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు […]
Road Accident: ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు మీద వెళ్లే ప్రయాణీకుల మూలంగా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే.. డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ ఇతరత్రా కారణాలతోనూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా మరణించే వారిలో 3వ వంతు ప్రమాదాల మూలంగా చనిపోతున్న వారే ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్ట రాజధాని లక్నోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం […]