Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ పొరుగింటిపై కాన్సట్రేషన్ చేసి.. సొంత గూటికి కాస్త దూరమయ్యాడు. వారణాసి, దైరా అంటూ ఇతర ఇండస్ట్రీలో బిజీ అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఎంపురన్2లో కనిపించినప్పటికీ.. క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత విలయాత్ బుద్ద అనే సినిమా చేశాడు కానీ ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయం కూడా కేరళ ఆడియన్స్ మర్చిపోయారంటే.. సినిమా ఏ లెవల్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది వచ్చిన పల్లిచట్టంబిలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు పృధ్వీ. కానీ అదీ సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు.
ద గోట్ లైఫ్, గురువార్ అంబలనడయిల్ తర్వాత సోలో హీరోగా వరదరాజ మన్నార్ హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అనదర్ ఇండస్ట్రీలపై కాన్సట్రేషన్ కారణంగా తన సినిమాలు కూడా ఆన్ టైంలో కంప్లీట్ చేయలేని పరిస్థితి. అయితే ఈ పొరుగు ఇండస్ట్రీల్లో కమిటైన భారీ ప్రాజెక్ట్స్ తన ఇమేజ్, మార్కెట్ డబుల్ చేస్తాయి కానీ కేరళ ఆడియన్స్‌తో టచ్ పోతే.. అసలుకే మోసం వస్తుందనుకున్నాడేమో.. సొంత గూటిలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేయబోతున్నాడు పృధ్వీ. నిషామ్ బషీర్ దర్శకత్వంలో వస్తున్న ఐ నోబడీలో నటించాడు పృధ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది ఫిబ్రవరి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోనై.. జులై 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఖలీఫా ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వరదరాజ్ మన్నార్. హిందీలో కరీనా కపూర్- మేఘనా గుల్జర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ దైరా సెప్టెంబర్ 18న రాబోతుంది. ఇలా వరుసగా టూ, త్రీ మంత్స్‌లో సౌత్, నార్త్ కవర్ చేసేస్తున్నాడు రణ కుంభ.
Also Read
- Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
- Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
- Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
- Tags
తాజావార్తలు
-
Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
-
Rohit Sharma-Team India: అగార్కర్‌తో విభేదాలు.. గంభీర్‌పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ట్రెండింగ్
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!