AP Cabinet: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీలో.. రాష్ట్రానికి కీలకమైన పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
కేబినెట్ ముందు ఉండనున్న కీలక అంజెడా ఇదే..
* రాష్ట్రంలో పరిపాలనను మరింత వికేంద్రీకరించి ప్రజలకు సేవలు వేగంగా అందించాలన్న లక్ష్యంతో.. 3 కొత్త జిల్లాలు, పలు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలపనుంది.
* అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.103.96 కోట్ల వ్యయంతో అధునాతన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇది రాష్ట్రాన్ని టెక్నాలజీ, రీసెర్చ్ హబ్‌గా మార్చే దిశగా మరో ముందడుగు కానుంది.
* సచివాలయ పరిధిలో ఉన్న అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రూ.109 కోట్ల నిధుల కేటాయింపుకు ఆమోదం ఇవ్వనున్నారు.
* అమరావతి పరిధిలోని శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల భూమిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
* రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేలా.. తుళ్లూరులో 6 ఎకరాల భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది.
* వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా.. 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో రూ.444 కోట్ల వ్యయంతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
* రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లే-అవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1358 కోట్ల నిధులు కేటాయింపుకు ఆమోదం తెలపనున్నారు.
* రాష్ట్రంలోని 202 ఎకరాల భూమి జరీబు (తడిభూమి) లేదా మెట్ట (పొడి భూమి) ప్రాంతమా అనే నిర్ధారణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది.
* పలు సంస్థలకు భూముల కేటాయింపు ప్రతిపాదనలకూ ఆమోదం తెలపనుంది కేబినెట్..
* ఋషికొండ నిర్మాణాల అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు..
* మెడికల్ కాలేజీ టెండర్లు, PPP విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఇవ్వనున్నారు
* తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి వ్యూహాలపై కేబినెట్‌లో సమీక్ష జరగనుంది..
* రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు, రాజధాని అమరావతి అభివృద్ధి, పరిశోధనా–విద్యా–ఆరోగ్య రంగాలకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగుతోంది.