సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్‌లో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం తరుపున పండుగ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్ని అమలు చేస్తాం. హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్ లో కరం విద్యార్థులకు కారం పెట్టిన ఘటన పై కలెక్టర్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పాను. […]
CP Kothakota Srinivas Reddy: ఇన్‌స్పెక్టర్లకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పోస్టింగ్ విషయంలో కొందరు ఇన్‌స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పోస్టింగ్‌ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. Also Read: Coronavirus: కరోనా అలజడి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు సిఫార్సు లేఖలు పట్టుకొచ్చే […]
మరోసారి కరోనా అలజడి మళ్లీ మొదలైంది. కొవిడ్ కొత్త వెరియంట్ జేఎన్-1 కారణంగా క్రమంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో సైతం కరోనా విజృంభిస్తోంది. కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిసి రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో వెల్లడించారు. అలాగే ఒకరు రికవరీ అయ్యారు. కాగా ఈ రోజు తెలంగాణలో […]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయ. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స ఆర్‌టీపీసీటీ టెస్ట్‌కు పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. వారు భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతో పాటు మరో వ్యక్తి రాజేందర్‌కు పాజిటివ్‌గా వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. అవుట్ పెషేంట్ అయినా రాజేందర్‌ను హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆస్పత్రి సిబ్బంది సూచించగా.. ఇన్ […]
మైనార్టీలకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సేమి క్రిస్మస్ వేడుకలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మత సామరస్యాన్ని కాపాడేందుకు శయా శక్తుల ప్రయత్నం చేస్తాం. దేశంలో మైనార్టీలకు రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్.. నేను చెప్పింది వాస్తవం. ప్రపంచానికి డిసెంబర్ నెల మిరకిల్ మంత్. పాపులను కాపాడాడు యేసు క్రీస్తు. మైనార్టీ […]
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శభవార్త అందించారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ […]
మైనర్ బాలికని అత్యాచారం చేసి గర్భవతిని చేసిన నేరస్తునికి నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2012లో జరిగిన ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరిచించింది. 2012 డిసెంబర్ నల్గొండ శివారులోని ఆర్జాల బావి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నిజాముద్దీన్ అలియాస్ నిజ్జు (36) అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం […]
ఈ రోజు శుక్రవారం డిసెంబర్ 22కు ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా నేటి రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది. అంటే తక్కువ పగలు.. ఎక్కువ రాత్రి ఉండబోతోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22వ తేదీల్లో మాత్రమే ఇలా జరుగుంది. అదీ కూడా ఒక్క భారతదేశంలో మాత్రమే. ఈ దృగ్విషయాన్ని శీతాకలపు అయనాంతంగా(Winter Solstice) పిలుస్తారు. అయితే శీతాకాలపు ఆయనాంతం అంటే ఏంటీ? ఇది ఎలా ఏర్పుడుతుందో ఓసారి చూద్దాం! ఎందుకిలా అంటే.. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి […]
సింగరేణి ఎన్నికలను బహిష్కరిచాలంటూ కార్మికులకు పిలుపునిస్తూ మావోయిస్టుల విడుదల చేసిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు అనుమతించిన అనంతరం మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమఖ్య (సికాస) కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. సింగరేణి ఎన్నికలను బహిష్కరించాలని లేదంటే TBGKS నాయకులకు శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు. ‘పోరాటల ద్వారానే హక్కులు సాధించుకోవాలి. కార్మిక […]
కాంగ్రెస్ శ్వేత పత్రానికి కౌంటర్‌గా మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రం ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం 42 పేజీల శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనికి కౌంటర్‌గా తాజాగా కేటీఆర్ స్వేద […]