ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయ. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స ఆర్‌టీపీసీటీ టెస్ట్‌కు పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. వారు భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతో పాటు మరో వ్యక్తి రాజేందర్‌కు పాజిటివ్‌గా వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. అవుట్ పెషేంట్ అయినా రాజేందర్‌ను హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆస్పత్రి సిబ్బంది సూచించగా.. ఇన్ పెషేంట్ అయినా యాదమ్మకు కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
Also Read: Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో సినిమా ఆర్టిస్ట్ అరెస్ట్..!
ప్రస్తుతం యాదమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం హాస్పిటల్ సూపరిండెంట్ తెలిపారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో రెండు కరోనా కేసు నమోదు అవ్వడంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టి జిల్లా కేంద్రంలోని వైద్యశాలలో ఐసోలేషన్ కోసం వంద పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అలాగే ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో 50 పడకలతో ప్రత్యేక వార్డు, 70కిపైగా కోవిడ్ వెంటిలెటర్లు అందుబాటులో ఉన్నాయని ఎంజీఎం సుపరిండెంట్ పేర్కొన్నారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటాం..