మరో ఫ్రెంచ్ ఫ్లేవర్ భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లోకి ప్రవేశించింది. సిట్రోయెన్ ఇండియా తన కొత్త ఎస్‌యూవీ ‘ఎయిర్‌క్రాస్ ఎక్స్’ని విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిట్రోయెన్ 2.0 ‘షిఫ్ట్ ఇన్ ది న్యూ’లో ఇది మూడవ మోడల్. ఇంతకుముందు సిట్రోయెన్ సి3 ఎక్స్, బసాల్ట్ ఎక్స్‌లను రిలీజ్ చేసింది. ఎక్స్ పేరుతో కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీకి మరిన్ని ఫీచర్లు, ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌ల ద్వారా మరింత ప్రీమియంగా మారింది.
ఎయిర్‌క్రాస్ ఎక్స్ కారు బయటి వైపున కొత్త డీప్ ఫారెస్ట్ గ్రీన్ కలర్, టెయిల్‌గేట్‌పై ‘X’ బ్యాడ్జింగ్‌ను కలిగి ఉంది. క్యాబిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ సాఫ్ట్-టచ్ లెథరెట్ ఇచ్చింది. బెజెల్-లెస్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సహా గోల్డ్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. పునఃరూపకల్పన చేయబడిన గేర్ లివర్, వెంటిలేటెడ్ లెథరెట్ సీట్లు, డీప్ బ్రౌన్ ఇంటీరియర్ థీమ్, యాంబియంట్ అండ్ ఫుట్‌వెల్ లైటింగ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.
ఫీచర్ల విషయానికొస్తే.. సిట్రోయెన్ పాసివ్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఆటో-ఇన్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, శాటిలైట్ వ్యూతో 360-డిగ్రీల కెమెరా ఉన్నాయి . కంపెనీ తన స్మార్ట్ CARA AI అసిస్టెంట్‌ను కూడా ఇచ్చింది. ఎయిర్‌క్రాస్కే ఎక్స్ కేవలం ఎస్‌యూవీ సైజును మాత్రమే కాకుండా సాంకేతికత, ప్రీమియం ఇంటీరియర్ అనుభవాన్ని కూడా కోరుకునే కస్టమర్లకు మంచి ఎంపిక. రూ.8.29 లక్షల ప్రారంభ ధర కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో బలమైన ఎంపికగా చేస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి ప్రసిద్ధ మోడళ్లతో పోటీపడుతుంది.
Also Read: Flipkart Sale 2025: ఫ్లిప్‌కార్ట్‌లో మరో అవకాశం.. అతి తక్కువ ధరకే iPhone 16 Pro!
ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లు:
# ఎయిర్‌క్రాస్ X కి ప్రీమియం టచ్ ఇవ్వడానికి సిట్రోయెన్ దాని క్యాబిన్‌లో అనేక మార్పులు చేసింది.
# సాఫ్ట్-టచ్ లెథరెట్ రోలింగ్: ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు డోర్ బోల్స్టర్లపై
# బెజెల్-లెస్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే
#7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
# డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ భాగాలపై బంగారు రంగు యాసలు
# కొత్త గేర్ లివర్ డిజైన్
# వెంటిలేటెడ్ లెదర్ సీట్లు
# ముదురు గోధుమ రంగు ఇంటీరియర్ థీమ్
#డిఫ్యూజ్ యాంబియంట్ లైటింగ్ మరియు ఫుట్‌వెల్ లైటింగ్