ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఏకంగా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ ఆరంభం నుంచి యూజీ తనదైన ముద్ర వేయలేకపోయాడు. మొదటి 5 మ్యాచ్‌లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అంతేకాదు కొన్ని మ్యాచ్‌లలో ధారాళంగా పరుగులు కూడా ఇచ్చాడు. అయినా కూడా పంజాబ్ మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్ రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులను కాపాడుకుని.. 16 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పంజాబ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. మరోవైపు అత్యధిక స్కోర్ (262)ను ఛేదించిన టీమ్‌గా ఇప్పటికే పంజాబ్ రికార్డ్ సాధించింది. ఈ రెండు రికార్డులను కోల్‌కతాపైనే […]
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయంలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. చహల్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తన 4 ఓవర్ల కోటాలో నాలుగు వికెట్లు పడగొట్టి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన […]
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓటమి బాధ్యతను తానే తీసుకుంటా అని ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే అని పేర్కొన్నాడు. ఈ ఓటమి పట్ల కొంచెం నిరాశగా ఉందన్నాడు. ఈ ఓటమితో కుంగిపోమని, ఇక ముందు మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం అని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 16 పరుగుల తేడాతో […]
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన హృదయ స్పందన చాలా పెరిగిందని పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. తనకు ఇప్పుడు 50 ఏళ్లు అని, ఈ వయసులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చహల్ ప్రదర్శన చెప్పలేనిదని, అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. ఐపీఎల్లో తాను ఎన్నో మ్యాచ్‌లకు కోచ్‌గా పనిచేశానని, ఈ విజయం మాత్రం ఉత్తమంగా మిగిలిపోతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మంగళవారం కోల్‌కతాతో ఉత్కంఠగా జరిగిన […]
గత సంవత్సరం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడి.. కెరీర్లో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మార్చి 2025కి గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును శ్రేయాస్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలను అధిగమించి మరీ శ్రేయాస్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ 243 పరుగులు చేసి.. భారత్ […]
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎప్పుడూ ముందుంటుంది. ఆటలో కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి.. అభిమానులకు ఐపీఎల్ మరింత చేరువవుతోంది. ఈ క్రమంలో ప్రత్యక్ష ప్రసారంలో సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్దమైంది. బ్రాడ్కాస్ట్ టీమ్‌లో సరికొత్త సభ్యుడు ‘రోబో డాగ్’ వచ్చి చేరింది. బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో చేరిన రోబో డాగ్‌ను ప్రముఖ కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మారిసన్ పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో […]
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు భారీ షాక్ తగిలింది. న్యూజీలాండ్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు తీవ్రమైన తొడ నొప్పితో మైదానాన్ని వీడాడు. ఫిజియోతో కలిసి మైదానాన్ని వీడిన ఫెర్గూసన్.. మరలా బౌలింగ్ చేయడానికి రాలేదు. ఫెర్గూసన్ లేని లోటు ఆ మ్యాచ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. […]
మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.160 తగ్గగా.. ఈరోజు రూ.330 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, రూ.350 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఏప్రిల్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా.. 24 క్యారెట్ల ధర రూ.95,180గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో […]
ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ప్రత్యర్థి ఆటగాడైనా సరే బాగా ఆడితే.. మైదానంలోనే ప్రశంసిస్తుంటాడు. సహచర, ప్రత్యర్థి ఆటగాళ్ల కష్టానికి క్రెడిట్ ఇవ్వడంలో ముందుండే మహీ.. తాజాగా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. తనకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వచ్చినా.. అందుకు తాను అర్హుడను కాదని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై […]