వివిధ సెల్ ల నేతలతో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా రంగాల్లో ప్రముఖులను అమిత్ షా సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, వ్యాపారస్తులు, వివిధ రంగాల్లో ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే.. రేపటి బీజేపీ కొర్ కమిటీ భేటీ వాయిదా పడింది. breaking news, latest news, telugu news, kishan reddy, amit shah,
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా, వరదలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో 42 కాలనీల్లోని ఇళ్లలోకి వర్షం వరద నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అధికారులు పాలకులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వాగులు వంకలు పొంగిపోర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. breaking news, latest news, telugu news, Heavy…
రాష్ట్ర వ్యాప్తంగా ‘సెల్పీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్’ అనే కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధిని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలోనే.. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో.. ఉచిత కరెంట్ ఫైలుపై సంతకం చేసిన వైఎస్ ఫోటో తో సెల్ఫీ దిగారు యాష్కీ. breaking news, latest…
గద్వాల జిల్లాలో నకిలీ వీఆర్ఏల గుట్టు రట్టైంది. గత కొన్ని ఏళ్ళుగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్న నలుగురు వీఆర్ఏలు పట్టుబడ్డారు. దీంతో.. తహసీల్దార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినెట్స్ గా నియమించడంతో నకిలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ వీఆర్ఏలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆర్టీఐ యాక్టివిస్ట్ విన్నవించారు. breaking news, fake VRA, telugu news, big news,