జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ లలో నుండి యువత ముందుకు వచ్చి బీజేపీ లో చేరడం హర్షణీయం అన్నారు హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు. యూసుఫ్ గూడ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన సమక్షంలో 300 మందికి పైగా యువతీ యువకులను ఆయన బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. breaking news, latest news, telugu news, big news, bjp, bjp goutham rao
వరంగల్ జిల్లా భద్రకాళి చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. చెరువు గండితో ప్రమాదం లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. పడ్డ గండి చిన్నదే... గండి పడ్డ ప్రదేశం నుంచి వెళ్లే నీళ్లు నాలా ద్వారా బయటికి పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. breaking news, latest news, telugu news, errabelli dayakar rao, dasyam vinay bhaskar
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వరద ప్రాంతాల్లో రేపు పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను కిషన్ రెడ్డి సందర్శిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రాంతంలో ముంపుబాధితులను కలుస్తారు. breaking news, latest news, telugu news, kishan reddy, flood affected areas, bjp,
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో.. ఖమ్మం జిల్లా బొక్కల గడ్డలో ముంపు వాసులకు నిత్యావసర వస్తువులు అందజేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, flood area, telangana floods
వరద గుప్పిట్లో భయంతో బతికిన మోరంచ పల్లి గ్రామం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. బురదమయమైనటువంటి ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్నారు. వండుకునే స్థితి లేకపోవడంతో బంధువులు తీసుకొచ్చిన భోజనం తినడము లేక అధికారులు ఏర్పాటు చేసిన భోజనం తినే స్థితిలోనే ఇంకా మొరంచపల్లి ఉంది. నలుగురు గల్లంతయితే ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. breaking news, latest news, telugu news, big news, flood effect, telangana floods
రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్ కోతలను అధిగమించి అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ పారిశ్రామిక సేవా వ్యాపార రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దార్శనికతతో విద్యుత్ ఉత్పత్తి లో స్వయం సంవృద్ధి సాధించుటకు అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. Breaking news, latest news, telugu news, big news, quality electricity supply, cm kcr