కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, రాజకీయాలు మీకు..మాకు అవసరమే.. కానీ ఏం మాట్లాడాలో..ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్ అని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారని, మిలిటెంట్లు కాల్చి చంపింది నిజమే కదా ? అని ఆయన అన్నారు. కేసీఆర్ గారు.. కేటీఆర్ కి […]
తెలంగాణలో పెరుగుతున్న పోలీసుల ఉదాసీనతను విమర్శిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళనకు దిగారు. చట్టాన్ని అమలు చేయకపోవడం, పెరుగుతున్న వేధింపులు మరియు రాజకీయ పూజలను సూచించే వివిధ సంఘటనలను ఆయన ఉదహరించారు. ట్విట్టర్ వేదికగా ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు కేటీఆర్. అక్కడ ఒక స్వీట్ షాప్ యజమాని “పోలీసుల వేధింపుల కారణంగా దుకాణం మూసివేయబడింది” అని పేర్కొంటూ దాని ముందు భారీ బ్యానర్‌ను […]
పంట రుణాలు మాఫీ కాని రైతుల నుంచి మంగళవారం వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించగా, అందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రైతులు వివిధ చోట్ల బైఠాయించారు. వేంసూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రైతు వేదిక వద్ద రైతులు నిరసన చేపట్టారు. రైతులకు మద్దతు తెలుపుతూ అఖిల […]
బొత్స.. బౌన్స్ బ్యాక్! ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. విశాఖ కేంద్రంగా ఈ మాజీ మంత్రి చక్రం తిప్పనున్నారా..? వైసీపీకి పూర్వవైభవం కోసం ఇదే సరైన నిర్ణయం అని హైకమాండ్ భావిస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిణామాల వెనుక రీజనేంటి.? వైఫల్యం నేర్పిన పాఠమా లేక.. స్ధానిక నాయకత్వానికి పెద్దపీట వేసే వ్యూహమా…? వైసీపీ అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ తర్వాత వైఫల్యాలను […]
లక్షలాది ధరణి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడానికి కారణం ఏంటి? ధరణిపై వస్తున్న ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని అధికారులు కావాలనే తిరస్కరిస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో.. ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ధరణి దరఖాస్తుల విషయంలో ఏమి జరుగుతోంది? తెలంగాణలో ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పెండింగ్ దరఖాస్తులు దాదాపు 5 లక్షల వరకు.. తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు తిరస్కరించగా, ప్రస్తుతం అదే వైఖరిని రెవెన్యూ అధికారులు […]
అధికారంలో ఉన్నప్పుడు హడావుడి అంతా ఆ నేతదే. జిల్లాలో పార్టీ క్లీన్‌స్వీప్ చేసినా.. అదృష్టం మాత్రం ఆయననే వరించింది. కొందరికి మూడేళ్లకే పదవి పోయినా.. ఆ మంత్రికి మాత్రం ఫుల్‌టైమ్ లభించింది. అయినా ఏం లాభం..? పార్టీ అధికారం కోల్పోగానే.. ఆయన సైలెంట్ అయ్యారు. ఫ్రేమ్‌లో కనిపించకుండా సైడ్ అయిపోయారు. దీంతో కూటమి నేతలు.. అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. ఆయన మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరు ? 2019 […]
సచివాలయంలో జలాశయాల పూడిక తీత పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాలికతో […]
సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు. కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారులకు వివరించారు. అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సౌండ్ లేకపోవడంతో […]
మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం రాంపూర్ గ్రామంలో సరస్వతి విద్యా మందిర్ నూతన భవన నిర్మాణానికి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ పరిణామాలపై అవగాహన లేకపోతే విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది.. బంగ్లాదేశ్ లో సంక్షోభమే నిదర్శనమన్నారు. దేశభక్తి, ధర్మాన్ని బోధించడంతోపాటు దేశ పరిణామాలపై చర్చలో శిశు మందిర్ భేష్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో నక్సల్ భావజాలం […]
సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో తాగుబోతు 108 సిబ్బందికి చుక్కలు చూపించాడు. తీవ్ర జ్వరం వచ్చిందని, హాస్పిటల్ కి వెళ్లాలని 108కు ఫోన్ చేశాడు పరుశరాములు. చెప్పిన అడ్రస్ కు వచ్చిన 108 సిబ్బంది.. రాగానే ఫోన్ చేయగా.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురయ్యారు 108 సిబ్బంది. 108 సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేయడంతో బాధితుడి కోసం ఆరా తీశారు 108 సిబ్బంది. ఫోన్ చేసిన సదర్ కాలర్ ను […]