ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వరదలతో ప్రజల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచి పాడైపోయాయి.. కంపెనీలు సామాజిక బాధ్యతతో బాధిత ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు.
ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని జగన్ ప్లాన్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్ లో.. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారు. 5 ఊళ్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే తరహాలో ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొని కూల్చేయాలని ప్లాన్ చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేయాలనుకున్నారు.’ అని తెలిపారు.
తెలంగాణ లో మేము పర్యటిస్తున్నాం.. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని రాష్ట్రం వివరించింది
తెలంగాణలో మేము పర్యటిస్తున్నామని, ఇది మా ఆరో రాష్ట్రమని 16వ పైనాన్స్ కమిషన్ చైర్మన్ అర్వింద్ పనగారియా తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా పారదర్శకంగా చర్చలు జరిగాయని, రాష్ట్రం లోనీ ఆర్థిక పరిస్థితిని రాష్ట్రం వివరించిందన్నారు. తెలంగాణ లో ఉన్న భవిష్యత్ ప్రణాళిక లు పైనన్స్ కమీషన్ ను ఆకర్షించిందని, అర్బన్ డెవలప్మెంట్ పై తెలంగాణ పోకస్ చేయడం అభినందనీయమన్నారు అర్వింద్ పనగారియా. దీంతో పాటుగా గ్రామీణాభివృద్ధి పై కూడా పోకస్ చేశారని, రాష్ట్రం లో ఆర్ధిక వృద్ధి , అప్పులపై ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు అర్వింద్ పనగారియా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అభిప్రాయాలను, వినతులను తీసుకున్నామని ఆయన తెలిపారు.
అభివృద్ధి కోసం మా పార్టీలోకి వస్తాం అంటే ఆహ్వానిస్తాం
పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తినని క్లారిటీ ఇచ్చారని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంని కలిశానని అరికేపూడి అన్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టు పరిధిలో ఉంది దాని మీద స్పందించమని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతకి ప్రక్రియ మొదలు పెట్టమంది.. నిర్ణయం తీసుకోమని చెప్పలేదన్నారు. అభివృద్ధి కోసం మా పార్టీ లోకి వస్తాం అంటే ఆహ్వానిస్తామని, న్యాయస్థానాలు చట్ట సభలకు డైరెక్షన్ ఇవ్వొచ్చా అనే దాని మీద చర్చ జరుగుతుందన్నారు. కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలనీ 10 వ షెడ్యూల్ లో ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడలో రేపటికి పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్లిపోతాయి.. త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వే
విజయవాడలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదలకు విజయవాడ వాసులు అతలాకుతలం అయ్యారు. కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు.. వారం రోజుల పాటు అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై పరిస్థితిని మాములు స్థితికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో గత పది రోజుల క్రితం వచ్చిన వరదలు.. తీవ్ర ప్రభావం చూపించాయన్నారు. 10 అడుగుల నీళ్లొచ్చి మొదటి అంతస్తు కూడా మునిగిందని తెలిపారు. బుడమేరు పొంగింది.. గండ్లు పడ్డాయి.. వందేళ్లలో లేని విధంగా వరదలు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన విజయవాడ కలెక్టరేట్లో ఉండి మానిటరింగ్ చేసి అధికారులకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు.
ప్రకాశం బ్యారేజీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. వైసీపీపై ఆగ్రహం
బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. మూడు గండ్లు పూడ్చిన విధానాన్ని మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. గండ్ల పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి సీఎంకి తెలిపారు. భవిష్యత్తులో కూడా బుడమేరు డైవర్షన్ కెనాల్, బుడమేరు కాల్వ వల్ల నగరానికి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వచ్చిన వరద కంటే మించిన స్థాయిలో వరదొచ్చినా తట్టుకునేలా గండ్లని పటిష్టం చేయాలని చంద్రబాబు తెలిపారు. బుడమేరుకు ప్రస్తుతం వచ్చిన వరద గతంలో ఎన్నడూ రాలేదని.. బుడమేరుకు వచ్చిన వరద విజయవాడ ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసిందన్నారు. పులివాగు నీరంతా శాంతి నగర్ ద్వారా నగరంలోకి వచ్చిందని.. ఆర్మీ కూడా ఈ గండ్లను పూడ్చలేక పోయిందని సీఎం తెలిపారు. బుడమేరు గండ్లను పూడ్చకుంటే నగరంలోకి వరద నీరు వస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కమిషన్ ముందు పొందుపరిచాం
రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కమిషన్ ముందు పొందుపరిచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కమిషన్ ముందు అర్బన్ డెవలప్మెంట్ పై దాన కిషోర్, ఇతర అంశాల సీఎస్ శాంతకుమారి ప్రజెంటేషన్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండాలని కోరాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం తయారీ పథకాలకు అనుమతి ఇవ్వాలని కోరామని, ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను గత ప్రభుత్వాల పాలన వల్ల అప్పుల పాలైందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే అప్పులకు వడ్డీలే ఎక్కువగా ఉన్నాయని, తెచ్చిన అప్పులు ఆ ప్రభుత్వాలు ఖర్చు చేసి వెళ్లిపోయారు.. ఇప్పుడు మాపై అప్పుల భారం పడిందని ఆయన వెల్లడించారు. అప్పుల భారం తగ్గించడానికి రీ స్ట్రక్చ్చరింగ్ చేయాలని ఫైనాన్స్ కమిషన్ ను కోరామని, ఇప్పుడున్న 41శాతం కాకుండా 50:50 ఉండేలా రికమెండ్ చేయాలని కోరాన్నారు భట్టి విక్రమార్క.
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు.. మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, కొనుగోలు ప్రక్రియకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..
గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో.. రానున్న కొద్ది గంటల్లో గోదావరి వరద మరింత పెరగనుంది. మరోవైపు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి పది లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు 12 లక్షల నుండి 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేసే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
10 రోజుల తర్వాత నివాసానికి సీఎం.. ప్రతీ రోజూ క్షేత్రస్థాయి పర్యటన
పది రోజుల తరువాత తన ఇంటికి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విపత్తు సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారాయన. విపత్తు సమయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉంటూ.. ప్రతీరోజూ క్షేత్రస్ధాయిలో వరద పరిస్ధితులను సమీక్షించారు సీఎం చంద్రబాబు. కలెక్టరేటునే సెక్రటేరీయేట్ చేసుకుని పర్యవేక్షించే వారు. అంతేకాకుండా.. ప్రతీరోజు రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. పది రోజుల్లో ప్రతి రోజూ క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లారు ముఖ్యమంత్రి. తొలి మూడు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో తెల్లార్లూ తనిఖీలు నిర్వహించారు. గండ్ల పూడ్చివేత మొదలుకుని సహయక చప్యల వరకు కలెక్టరేట్ నుంచి పది రోజుల పాటు పర్యవేక్షించారు. దీంతో.. వినాయక చవితి, పెళ్లి రోజును కూడా కలెక్టరేట్ ప్రాంగణంలోనే జరుపుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.