మహిళపై పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ప్రతి పక్ష పోషిస్తున్నారా అర్థం కాట్లేదని, మమ్ముల్ని జుట్టు పట్టుకుని బూట్లతో తన్నారని ఆమె ఆరోపించారు. సీపీ విచారణ చేసి యూనిఫాం వేసుకున్న దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు వేస్తారన్న కేటీఆర్ ఇంట్లో కూడా బ్రేక్ డాన్స్ లు వేస్తున్నారా […]
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలొచ్చినంత మాత్రాన ఆల్ హ్యాపీస్ కాదా? ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటున్నారా? వరుసబెట్టి వస్తున్న ఫిర్యాదులు ముందు ముందు మంట పుట్టించబోతున్నాయా? పిన్నెల్లి చుట్టూ పొలిటికల్ ఉచ్చు గట్టిగానే బిగుస్తోందా? అసలు మాచర్లలో ఏం జరుగుతోంది? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులమంటూ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. భూ కబ్జాలు, బెదిరింపులపై ఫిర్యాదుల పరంపర పెరుగుతోంది. తమను బెదిరించి పిన్నెల్లి, ఆయన అనుచరగణం ఆస్తులు లాక్కున్నారని, వాళ్ళ […]
తెలంగాణ బీజేపీ నేల విడిచి సాము చేయాలనుకుంటోందా? ఆ పార్టీ ముఖ్యులు వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నారా? సభ్యత్వ నమోదు విషయంలోనే వాళ్ళ ఆలోచనలోని డొల్లతనం తేలిపోతోందా? అలవికాని లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? రాష్ట్రంలో కమలం పార్టీ వాస్తవ సామర్ధ్యం ఎంత? వాళ్ళు పెట్టుకున్న మెంబర్షిప్ టార్గెట్ ఎంత? బీజేపీలో సభ్యత్వ హడావుడి మొదలైంది. ఈసారి తెలంగాణలో భారీ ఎత్తున కొత్త సభ్యత్వాలను ఇప్పించాలని టార్గెట్ పెట్టుకుందట పార్టీ. అదీ కూడా అలా ఇలా కాదు… […]
పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు పవర్‌ఫుల్‌గా కనిపించారు ఆ వైసీపీ సీనియర్. అబ్బో… ఆయన పరపతి అరచేతి మందం అనుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరీ పార్టీ పవర్‌ని బాగానే ఎంజాయ్ చేశారట. కానీ జస్ట్… అలా అధికారం పోయిందో లేదో… ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శాటిలైట్ సెర్చ్‌లో సైతం దొరకడం లేదన్న సెటైర్స్ పడుతున్నాయి. సాటి సీనియర్స్‌ని ఫిక్స్ చేస్తున్న కేసుల భయం ఆయన్ని కూడా వెంటాడుతోందా? ఎవరా నాయకుడు? ఏంటాయన అజ్ఞాతవాసం కహానీ? భూమన కరుణాకర్‌రెడ్డి, వైసీపీ నేత. […]
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లిలో గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 17500కిలో మీటర్లు సీసీ రోడ్లు వేస్తామన్నారు. మట్టి అంటకుండా బయటకు వెళ్లేలా చేస్తామన్నారు. 10వేల కిలోమీటర్లు మురికి కాల్వలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక […]
కోల్‌కతాలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో అన్ని ఎలక్టివ్ డ్యూటీలు, ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరించిన తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( TJUDA) తమ నిరసనలను శుక్రవారం విరమించుకుంది. ఔట్ పేషెంట్, ఎలక్టివ్‌లు, వార్డు విధులు, అత్యవసర సంరక్షణతో సహా అన్ని వైద్య సేవలు శనివారం నుండి అంతరాయం లేకుండా పనిచేస్తాయని TJUDA శుక్రవారం తెలిపింది. “డాక్టర్ అభయకు న్యాయం చేయడానికి […]
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుడు శుక్రవారం ఉదయం ఎంజీఎం జంక్షన్ వద్ద 58 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సెల్ఫ్‌లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్)ను గుర్తించారు. నివేదికల ప్రకారం, ఒక పారిశుధ్య కార్మికుడు, MGM జంక్షన్ గుండా వెళుతుండగా రోడ్డుపై రైఫిల్‌ను గమనించాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారు రైఫిల్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకు అందజేశారు. ఇది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న సీఆర్పీఎఫ్ బెటాలియన్‌గా గుర్తించిన కమిషనర్ పోలీసులకు సమాచారం అందించారు. […]
కొత్త సిటీ నిర్మాణం, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కీలక అడుగు వేసింది. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణకు దిగింది. ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను దీని పరిధిలోకి చేర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్‌లో 19 ప్రాజెక్టులపై […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారన్న నాయకులు మండిపడ్డారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అరాచక పాలన […]