Duddilla Sridhar Babu : 33 కోర్సులను ప్రక్షాళన చేసి విద్యార్థులకు అందిస్తాం
- గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయి
- ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారు
- రాష్ట్ర ప్రభుత్వం విద్య.. వైద్యంపై ప్రత్యేకమైన శ్రద్దగా పెట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : గత ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలివ్వలేదని విమర్శించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలుచ్చామని ఆయన తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయని, ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేకమైన శ్రద్దగా పెట్టిందని, పాలమూరులో రెండు ఏటీసీ ( అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్) ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పాలమూరులో స్కిల్ యూనివర్సిటీ విభాగం ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తామని, గత ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమించలేదని మండిపడ్డారు.
Top 10 Smallest Creatures: ప్రపంచంలోనే టాప్ 10 చిన్న జీవులు..
Also Read
యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశ్రమలు అనుసంధానం చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, టాటా టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. 33 కోర్సులను ప్రక్షాళన చేసి విద్యార్థులకు అందిస్తామని, బీఏ, బీకాం చదివే విద్యార్థులకు బ్యాంకింగ్ , పైనాన్షియల్ కోర్సులను జోడించి నైపుణ్యం కల్పిస్తామన్నారు. విద్యార్థుల పరిశోధనలకు తోడ్పాటు నందిస్తామని ఆయన వెల్లడించారు. పారిశ్రామీకరణకు విద్యను అనుసంధానం చేస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు మాది బాధ్యత.. పాలమూరు జిల్లా సీఎం జిల్లా. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. కీలక ఆధారాలు స్వాధీనం
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు