South Central Railways : సంక్రాంతి పండుగ సీజన్ దృష్ట్యా ప్రయాణీకుల అదనపు రద్దీని నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వేచేపట్టిన చర్యలు చేపట్టింది. సంక్రాంతి పండుగ సీజన్ దృష్ట్యా స్టేషన్లు , రైళ్లలో ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది దక్షిణ మధ్య రైల్వే.. దక్షిణ మధ్య రైల్వే పండుగ సీజన్ల దృష్ట్యా అదనపు ప్రయాణ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైలు వినియోగదారుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి వివిధ గమ్యస్థానాల మధ్య జనవరి నెలలో 366 సంక్రాంతి ప్రత్యేక […]
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని […]
Harish Rao : ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయని, అసెంబ్లీలో ప్రకటించిన […]
Cyber Fraud Village : ఐదు రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిబ్బంది.. 23 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఈ అరెస్ట్‌ల వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడిస్తూ.. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండటంతో నిందితులను పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో 23 మంది సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితులు నేరాలకు పాల్పడినట్లు […]
నా వల్ల కూడా తప్పులు జరిగాయ్.. నేనూ మనిషినే, దేవుడిని కాదు.. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నిఖిల్ ఈ ఇంటర్వ్యూ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు, రాజకీయాల్లోకి యువత ప్రవేశం, మొదటి, రెండవ టర్మ్ పాలన మధ్య వ్యత్యాసంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి సారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకి […]
CM Revanth Reddy : హైటెక్ సిటీలో CII జాతీయ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ CII గ్రీన్ బిజినెస్ సెంటర్లో సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషమన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది… తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ […]
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్ల పల్లి గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు జరిగాయన్నారు. సత్తుపల్లి ప్రజలకు ఎక్కడ ఉన్న రుణపడి ఉంటానని, నా నియోజకవర్గం కంటే సత్తుపల్లి కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగిపోయిన సీతారామ ప్రాజెక్ట్‌ను కదిలిచ్చి గోదావరి జలాలు తమ్మిలేరు ద్వారా బెతుపల్లి […]
Formula E Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి (BLN Reddy) ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. శుక్రవారం జరిగే విచారణలో, బీఎల్ఎన్ రెడ్డి నుండి హెచ్ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు బదిలీ చేసిన అంశంపై ఏసీబీ తన విచారణను కొనసాగించనుంది. ఈ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి పై ప్రశ్నలు సంధించడానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ […]
VC Sajjanar : టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “జంప్డ్ డిపాజిట్ స్కామ్” పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందేశంలో భాగంగా, స్కామ్ వివరాలు తెలియజేసే వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన హెచ్చరిస్తూ, “మీకు తెలియని వ్యక్తుల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు మీ ఖాతాలో జమయితే సంబరపడిపోకండి. […]
HYDRA : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా […]