Bomb Threat : ఆపరేషన్ సింధూర్’ విజయంతో దేశమంతా ఉత్సాహంగా ఉన్న వేళ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. సవాయ్ మాన్సింగ్ (SMS) స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలికి ఈ బెదిరింపు సందేశం మెయిల్ ద్వారా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో అందింది. “ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా మీ స్టేడియంలో బాంబు పేలుస్తాం” అంటూ ఆ మెయిల్లో హెచ్చరించడంతో […]
Missile Attack : ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. గురువారం తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో పంజాబ్‌లోని అమృతసర్ సరిహద్దు జిల్లాలో భీకర శబ్దాలు, ఆకాశంలో వెలుగులు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఉదయం జెతువాల్, మఖన్ విండి, పాంధేర్ శివారు ప్రాంతాల్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. Miss World 2025 : […]
Miss World 2025 : ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న క్రమంలో.. అలాగే దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ట్రైడెంట్ హోటల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఈ హోటల్లోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందమైన కంటెస్టెంట్లు బస చేస్తున్నారు. ట్రైడెంట్ హోటల్ భద్రతా బాధ్యతలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్లో ఆక్టోపస్ టీమ్‌తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్ పోలీసులు హోటల్లో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు […]
Pakistan Shelling : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పాకిస్తాన్ సైన్యం బుధవారం చేసిన ఘనమైన దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో 15 మంది పౌరులు మరణించగా, 43 మంది గాయపడ్డారు. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారిపోయాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపై కూడా పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్ చేసి దాడి చేసింది. […]
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన […]
Operation Sindoor: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన గత అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు నిన్ననే సమావేశమై ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ […]
Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్‌లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్‌ను వారు ప్రయోగించినా, […]
Blast : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి మావోయిస్టుల ఉనికిని గుర్తుచేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, భద్రతా దళాలు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో మావోయిస్టుల తాకిడి ఎదురవ్వగా, ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. […]
HYDRA : భారతదేశంలో అనేక మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల అట్టడుగు లోతు కల్పించేవి వంటి సమస్యలపై దృష్టి సారిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడమనే నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మితమైన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ […]
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. […]