Attaullah Tarar : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే, పాక్ ఈ ఆరోపణలను ఖండించింది. భారత సాయుధ బలగాలు కఠినంగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించిన అనంతరం, పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్పందిస్తూ—”పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడలేదు, అలాంటి ఆలోచన కూడా చేయదు” అని స్పష్టం చేశారు. “ప్రజలు విజయోత్సవాల్లో మునిగి ఉన్న ఈ సమయంలో అలాంటి చర్యలకు తావే లేదు. పాకిస్థాన్ వైపు […]
Shashi Tharoor : ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై అంగీకారం ప్రకటించిన కొన్ని గంటలకే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో స్పందించారు. శనివారం రాత్రి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హిందీలో ఓ ద్విపదను పోస్ట్ చేసిన ఆయన, “ఉస్కీ ఫిత్రత్ హై ముకర్ జానే కీ, ఉస్కే వాదే పే యకీన్ కైసే కరూ?” అంటూ వ్యంగ్యంగా విసిరారు. దీని అర్థం: “మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను […]
India Pak War : ఖంగున మోగే బాణాసంచా వెలుగులు, బంధుమిత్రుల సందడితో కళకళలాడుతున్న పెళ్లింట ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. గురువారం రాత్రి రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్అవుట్ కారణంగా జోధ్‌పుర్‌లోని పావ్టా ప్రాంతంలో జరుగుతున్న ఆ వేడుకలో ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వధూవరులు సప్తపది వేసే శుభఘడియకు సరిగ్గా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే, ఆటంకం ఎదురైనా ఆనందానికి అడ్డుకట్ట పడలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా తమ సెల్ఫోన్ల టార్చ్లైట్లు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా […]
IMF: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారీగా నిధులు మంజూరు చేసింది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 8,500 కోట్లు) నిధులను విడుదల చేసింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు మరింత అవకాశం లభించింది. అయితే, ఈ ఆర్థిక సహాయం భారత్‌కు మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ నిధులను విడుదల చేయడానికి కొన్ని షరతులు విధించినప్పటికీ, […]
India Pak War: భారత్‌పై పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో చేస్తున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీనగర్‌లో మరోసారి భీకరమైన పేలుళ్లు సంభవించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పేలుళ్ల శబ్దం వినగానే అధికారులు వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను […]
India Pak War : పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన దుశ్చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. శనివారం ఉదయం నుంచే జైసల్మేర్ వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ అప్రమత్తమయ్యారు. నగరమంతా ఖాళీ చేయిస్తున్నారు. భయానక సైరన్ల మోతతో జైసల్మేర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జైసల్మేర్‌కు కేవలం 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిడా గ్రామంలో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్‌ను భారత ఆర్మీ సమర్థవంతంగా కూల్చివేసింది. అయితే ముప్పు ఇంకా పొంచి ఉందన్న హెచ్చరికలతో […]
No Firecrackers : భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు హైదరాబాద్ నగరంలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో, నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. Bangladesh: బంగ్లాదేశ్‌కు షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..! సరిహద్దుల్లోని పరిస్థితులు ఆందోళనకరంగా […]
Bangladesh: పాకిస్తాన్‌తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్‌పై కూడా దృష్టి సారించింది. భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న 4 బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ మీడియానే స్వయంగా వెల్లడించింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన 4 వార్తా ఛానెళ్లను భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు. బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానెళ్లలో జమునా టీవీ, యాక్టర్ టీవీ, […]
Vikram Misri : భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. పాక్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీపై ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై భారత ప్రభుత్వం అత్యవసరంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రి స్పందించారు. పాక్ జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించుతోంది. అలాంటి ప్రచారాలను నమ్మవద్దని హెచ్చరించారు. పాక్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే వ్యతిరేకంగా […]
Vyomika Singh : పాకిస్తాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం విరమించడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయి. పంజాబ్‌లోని పలు కీలకమైన ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. మానవత్వం మరిచి శ్రీనగర్‌లోని స్కూళ్లు, ఆసుపత్రులపై కూడా దాడులకు తెగబడుతోంది. రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను కూడా టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ తన పిరికి చర్యలకు పాల్పడుతోందని వింగ్ కమాండర్ వ్యోమిక […]