Gogikar Sai Krishna
Author- NTV Telugu-
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురి అరెస్ట్
ఏపీలో రాజకీయ దుమారం రేపిన టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మరో ఏడుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ కార్యాలయం ఘటనపై ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే.. చంద్రబాబు ఏపీకి సీబీఐ, కేంద్ర బలగాలు రావద్దంటూ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ఎలా అడుగుతున్నారని వైసీపీ శ్రేణులు […] -
29 నెలలైంది.. మీరు ఏం చేశారు : దేవినేని ఉమ
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటునే.. మరో వైపు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వారి మాటలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి 29 నెలలు గడిచినా […] -
విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కింపు..
ఈ నెలలో దేవి శరన్నవరాత్రోత్సవాలు విజయవాడ ఇంద్రాకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా జరిగాయి. తొమ్మది రోజలు అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దుర్గమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు అమ్మవారి హుండీ ఆదాయం రూ. 2.87 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బంగారం 546 గ్రాములు రాగ, 9.55 కిలోల […] -
కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
టీఆర్ఎస్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ వేదికగా హైటెక్స్ లో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బడుగు, బలహీన వర్గాలు కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. అన్ని కులాలను, వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని, దళితులకు […] -
భక్తులకు షాక్.. శ్రీశైలంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేత..
శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కార్తీకా మాసం. రానున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీకమాసం సందర్భంగా కార్తీకమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.5వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బంద్‌ను ఉపసహరించుకున్న రేషన్ డీలర్లు.. కానీ..
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా రేపటి నుంచి రేషన్ షాపులకు బంద్‌కు పిలునిచ్చిన రేషన్ డీలర్లు వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ.. ప్రభుత్వం స్పందించేంతవరకు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని విజయవాడలో రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కమిషన్ బకాయిలు 2020 నుంచి చెల్లించడం లేదన్నారు. వాటితో పాటు గోనె సంచుల బకాయిలు చెల్లించడం లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ధర్నాలు నిర్వహిస్తామని […] -
రేవంత్ రెడ్డికి డీజీపీ మహేందర్ రెడ్డి కౌంటర్..
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయట్లేదని.. ఫోన్ ట్యాపింగ్‌లపై రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలీస్ శాఖలో గ్రూపులు లేవని, అసత్య ప్రచారంలో మమల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. […] -
జోరుమీదున్న కారు, కాషాయం.. కానీ కాంగ్రెస్..?
ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వాటి ప్రచారాల్లో దూకుడు పెంచాయి. ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహ్యాలను ఎంచుకుంటున్నారు. ప్రచారంలో తమ దైన శైలితో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సర్వే సంస్థలు […] -
ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి : బండి సంజయ్
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అంటూ ఆరోపించారు. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక […] -
ఉస్మానియాలో ఊడిపడిన ఫ్యాన్.. డ్యూటీ డాక్టర్ కు గాయాలు..
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆగ్రస్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది. పేదవారికి సంజీవినిలా ఉన్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువులా ఉండే ఈ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్సకు వచ్చిన […]
తాజావార్తలు
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!