సీఎం జగన్ అధ్యక్షతన తిరుపతిలో కాసెపట్లో సదరన్ జోనల్ కౌన్సిల్ ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న జగన్‌కు మంత్రులు, నేతలు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఈ సమావేశం కేంద్ర హోమంత్రి అమిషా నేతృత్వం జరుగనుంది.
ఈ సమావేశంలో పలు పెండింగ్ అంశాల గురించి సీఏం జగన్ చర్చించనున్నారు. తెలంగాణ తరుపున హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్‌లు ఈ సమావేశానికి హజరవనున్నారు. ప్రారంభ ఉపన్యాసం సీఎం జగన్ చేయనున్నారు. ముగింపు ఉపన్యాసం అమిషా చేస్తారు.