అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్.. రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. దీంతో అస్సాం సీఎంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ అస్సాం సీఎంపై […]
నేడు రెండో రోజు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం బెంగుళూరులో జరుగనుంది. నిన్న వేలంలోకి అన్ని విభాగాల్లోని 96 మంది క్రికెటర్లు వచ్చారు. అయితే 96 మందికి 74 మందిని ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. మరో 22 మంది కొనుగోలుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఫ్రాంచైజీల వద్ద మొత్తం 107 మంది ఆటగాళ్లు ఉన్నారు. నేడు ఏపీలోని విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. స్టీల్ ప్లాంట్ నుంచి […]
ఏడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దూరదృష్టితో కొత్త ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా పనులు చేపట్టాలని శుక్రవారం తొలిసారిగా అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అన్నారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళికలను మంత్రికి వివరించారు. దేశంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణాకు హైదరాబాద్ మణిహారంగా […]
లాన్ పార్కింగ్ చేసుకున్న కార్లు అగ్నికి ఆహుతైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్కింగ్‌లో ఒక్కసారిగా ఓ కారులో మంటలు చెలరేగి నాలుగు కార్లుకు మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే మంటలను అదుపు చేసే లోపే 4 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. […]
సీఎం కేసీఆర్ నేడు జనగామ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అయితే టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభ ప్రజల పాలిట భయానక సభగా మారింది. ఎందుకంటే.. టీఆర్ఎస్ సభతో హైదరాబాద్ వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. దారి లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న […]
భద్రాచలం ఎన్నికలు నిర్వహించడం లేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భద్రాచలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్.వీరయ్య పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్ విచారణ జరిపింది. భద్రాచలం పంచాయతా..? మున్సిపాలిటా? ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని ఎస్ఈసీ హైకోర్టుకు తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించింది. ఐదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భద్రాచలం ఎన్నికలపై 4 వారాల్లో వివరణ […]
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లాలోని ఆలూరులో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యే లు దౌర్జనానికి పాలుపడుతున్నారని ఆయన అన్నారు. కొడాలి నాని ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్ జరిగినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోరని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, రెండునరేళ్ళలో అన్ని వర్గాల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చిందని ఆయన విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన […]
కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ వాళ్లు ప్రధానిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్లో మీ శక్తి ఎంతని, సీపీఐకి దేశం లో ఓ ఎంపీ ఉన్నాడని ఆయన అన్నారు. సీపీఎం శక్తి ఎంత… కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయిందని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు రాష్ట్రంలో తోక పార్టీలుగా మిగిలాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాలు మూసివేశారని, ప్రధానిని విమర్శించే ముందు […]
2002, 2003 నుండి మోహన్ బాబుతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాఫీ కోసం పిలిస్తే వారి ఇంటికి వెళ్లానని, మాటల సందర్భంగా సినిమా వ్యవహారాలు చర్చకు వచ్చాయని, కానీ కొందరు దీనిపై కూడా దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న మోహన్ బాబు రానందుకు వివరణ ఇవ్వటానికి వెళ్లానని అంటున్నారని, అదేమీ కాదు, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన […]
ఏపీల సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నేడు సినీ నటుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పేర్ని నాని తమ ఇంటికి రావాడాన్ని తెలుపుతూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలపై చర్చించడానికి విచ్చేసిన పేర్నినాని కృతజ్ఞతలు అన్నట్లుగా ఆయన ట్విట్ చేశారు. దీంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. […]