తెలంగాణ టీఆర్ఎస్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గతంలో ఉద్యమంలా ఎలా వచ్చారో, ఇప్పుడు కూడా రైతుల కోసం అలాగే వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు రైతుల పోరాటం న్యాయమైన పోరాటమని, ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అని ఆయన జోస్యం చెప్పారు. […]
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ నేడు టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపత్యంలో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు నీళ్లు, కరెంట్, రైతు బంధు ఇచ్చాము.. వడ్లు కొనలేమని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. యాసంగి వడ్లు కొనకుండా కేంద్రం నటకాలాడుతోందని, రైతులను వరి వేయండి, […]
తెలంగాణలో వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్వీట్ పెట్టారు, రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని, ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్ […]
హైదరాబాద్‌లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మెట్రో స్టేషన్‌పై నుంచి దూకడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ చెందిన షబానాగా పోలీసులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమ విఫలమైనందుకే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ […]
భారత్‌లోని అత్యంత సంపన్నుల టాప్ 10 జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారతీయ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఉండగా, మూడవ స్థానంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ్ నాడార్ నిలిచారు. అయితే ఈ మూడు స్థానాల్లో గతేడాది కూడా ఇదే విధంగా వీరే ముగ్గురు ఉన్నారు. కానీ.. ముఖేశ్ అంబాని వ్యక్తిగత సంపద 90.7 బిలియన్ డాలర్లకు చేరుకుందని, […]
ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున సీఎం కేసీఆర్ త్వరలోనే 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో నేడు పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ […]
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా రామగిరి కోటను పరిరక్షించాలని శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిప్రతం అందజేశారు. 12వ శతాబ్దానికి చెందిన కోటకు సరైన రహదారి, ఇతర మౌళిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కిషన్‌రెడ్డికి విన్నవించారు. సాంస్కృతిక వారసత్వం, ఔషధ మొక్కల కేంద్రంగా రామగిరి కోట ఉందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు తెలిపారు. […]
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఈ రోజు దళిత బంధు ప్రారంభమైంది. మండలంలోని బడ్డాయిపల్లి గ్రామంలోని దళితులకు దళిత బంధు ద్వారా వచ్చిన ట్రాక్టర్ లను జేసీబీలను బొలెరో వాహనాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అందజేశారు. అలాగే 20 మంది లబ్ధిదారులకు డైరీ కి సంబంధించి ప్రొసిడింగ్స్ ను కూడా సందర్భంగా అందజేశారు. మర్పల్లి మార్కెట్ యాడ్ లో వైభవంగా జరిగిన దళిత బంధు వాహనాల పంపిణీలో లబ్ధిదారుల తో పాటు నియోజకవర్గంలోని నాయకులు కూడా […]
వేసవి తాపం అప్పుడే మొదలైంది. వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వేసవికాలంలో ఎదుర్కొనే నీటి ఎద్దడిని తప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అనుకున్న దాటి కంటే వేడి తీవ్రత అధికంగా ఉండటంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలెవ్వరూ నీటికి ఇబ్బంది పడకుండ ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ వేసవిలో తాగునీటి సరాఫరాపై ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో […]
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. నిమ్స్ లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల సమస్యలు పరిష్కరించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. 423 మంది స్టాఫ్ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఇది దుర్మార్గమని ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి సెలవులు నుంచి జీతాల పే స్లిప్ ల వరకు […]