-
Sri Lanka: శ్రీలంకలో 60 మంది భారతీయుల అరెస్ట్.. ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు గుర్తింపు
ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోక్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. కొలంబోలోని మడివెల, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుంచి వారిని గురువారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 135 మొబైల్స్, 57 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్ఎస్పి నిహాల్ తల్దువా తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. అనుమానంతో నెగొంబోలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు […] -
Hemant Soren: అయిదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం..
భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు. -
DELHI: నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసన..స్పృహ తప్పిపడిపోయిన రాజ్యసభ ఎంపీ..
పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
Indian Railway: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్న రైల్వే.. దేశంలో తొలిసారిగా స్టేషన్ల భవనాలపై సోలార్ ప్యానెల్స్
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు భారతీయ రైల్వే కూడా ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. నేషనల్ ట్రాన్స్పోర్టర్ 2030 నాటికి గ్రీన్ రైల్వేను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
Elon Musk: పుట్టిన రోజున ఎలాన్ మస్క్ కు భారీ షాక్..అదేంటంటే ?
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు. -
Dr K Laxman: కాంగ్రెస్ ఎంతో మందిని బలితీసుకుంది: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
కాంగ్రెస్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుందని..కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేయడం వల్ల తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ సిటీ ఆఫీస్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు. -
Jeevan Reddy: “కాంగ్రెస్ ని వీడే ప్రసక్తే లేదు”..భట్టి తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య
తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని..చేరికల విషయంలో మనస్థాపం చెందానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు. -
KCR: తెలంగాణ విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. -
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి, పొంగులేటి..
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
Huzurabad: హుజూరాబాద్ లో హైటెన్షన్.. నేతల హౌస్ అరెస్ట్.. కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!