Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
- ప్రభుత్వ డిజిటల్ కీని ప్రైవేట్ వ్యక్తికి విక్రయం
- 22 నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల తయారీ
- బతికున్నవారి పేర్లతో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు
- ఇద్దరిపై కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet Fake Death Certificate Scam : సిద్దిపేట జిల్లాలో దిగ్భ్రాంతికరమైన నకిలీ డెత్ సర్టిఫికేట్ల కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేటు వ్యక్తుల ఆశ కలగలసి బతికి ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి లక్షలాది రూపాయల ఇన్సూరెన్స్ సొమ్మును కాజేసిన దారుణ ఉదంతం కలకలం రేపుతోంది. ప్రభుత్వ డిజిటల్ కీని ప్రైవేట్ వ్యక్తులకు తెగనమ్మి ఈ భారీ స్కామ్‌కు బాటలు పరిచారు.
ప్రభుత్వ ‘ఈ-సైన్ డాంగిల్’ విక్రయం.. ముడుపుల మత్తులో సెక్రటరీ
చేర్యాల మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన భూక్య మధు, ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన ‘ఈ-సైన్ డాంగిల్’ (డిజిటల్ కీ) ను హైదరాబాద్‌కు చెందిన రమేష్ అనే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకున్నాడు. ఈ అక్రమ వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీ మధుకు భారీగా ముడుపులు ముట్టినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారిక డిజిటల్ సంతకాన్ని ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టడంతో ఈ స్కామ్ మొదలైంది.
Also Read
- Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
- Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
- Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
- Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికేట్ల దందా
పంచాయతీ సెక్రటరీ నుంచి పొందిన డిజిటల్ సైన్ల ఆధారంగా హైదరాబాద్‌లోని ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడైన రమేష్ నకిలీ డెత్ సర్టిఫికేట్ల తయారీకి తెరలేపాడు. 2026 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లను తయారు చేసినట్లు విచారణలో తేలింది. కుటుంబ సభ్యుల పేర్లపై భారీగా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, వారు సజీవంగా బతికి ఉండగానే చనిపోయినట్లు ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ద్వారా రూ.లక్షలు కాజేసినట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం
ఈ భారీ డిజిటల్ ఫ్రాడ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. విషయం తెలిసిన వెంటనే ఎంపీఓ (MPO) స్పందించి చేర్యాల పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎంపీఓ ఫిర్యాదు మేరకు పంచాయతీ సెక్రటరీ మధుతో పాటు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కామ్‌లో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది, ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు పక్కదారి పట్టాయనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
-
Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
-
Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!