Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Name Not Mandatory: సింగిల్ పేరెంట్ పిల్లలు, అనాథలు, తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.. పిల్లల విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన దరఖాస్తుల్లో తండ్రి పేరును తప్పనిసరి చేయకుండా ఐచ్ఛికంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్ణయించింది. తండ్రి పేరు లేకున్నా పిల్లలకు విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నిర్ణయంతో సింగిల్ పేరెంట్ పిల్లలు, అనాథలు, తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు ఊరట లభించనుంది.
పిల్లల గౌరవం, గోప్యతకు ప్రాధాన్యం
పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ దరఖాస్తుల సమయంలో తండ్రి పేరు తప్పనిసరిగా అడగడం వల్ల కొందరు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషన్ గుర్తించింది. ముఖ్యంగా సింగిల్ పేరెంట్ కుటుంబాలు, అనాథలు, తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. తండ్రి పేరు వెల్లడించకూడదనుకునే కుటుంబాల హక్కులను గౌరవించాలని సూచించింది. పిల్లల గౌరవం, గోప్యత, సమానత్వ హక్కులను కాపాడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
Also Read
- CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
- CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
- CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
నవంబర్ 10న విజయవాడలో అవగాహన కార్యక్రమం
తండ్రి పేరును ఐచ్ఛికంగా మార్చే అంశంపై ప్రజల్లో, విద్యాసంస్థల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి కమిషన్ శ్రీకారం చుట్టింది. ‘తండ్రి పేరును ఐచ్ఛికం చేయడం’ అనే అంశంపై నవంబర్ 10న విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తండ్రి పేరు తప్పనిసరి నిబంధన వల్ల ఎదురవుతున్న సమస్యలు, పిల్లల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ సేవలు అందరికీ సమానంగా చేరేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించనున్నారు.
తాజావార్తలు
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
-
Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
-
Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!