-
Former CM Nadendla Bhaskara Rao: కుల గణనకు నేను వ్యతిరేకం కాదు.. కానీ ఓ అనుమానం!
కుల గణనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సూచన చేయాలనుకున్నట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తెలిపారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు.. పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే భూములు కొని ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. అలాంటి పరిస్థితిలో.. కుల గణనతో ఇబ్బంది వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. గజిబిజి లేకుండా సాఫీగా జరగాలని సూచించారు. -
Bandi Sanjay: మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. మానకొండూర్ మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. -
Madhavaram Krishna Rao: కుల గణన సర్వే చేయడానికి వచ్చిన అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Hydra: టెన్షన్.. టెన్షన్.. అమీన్ పూర్‌కు చేరుకున్న హైడ్రా బృందం..
హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. హైడ్రా బృందం సోమవారం అమీన్ పూర్‌కు చేరుకుంది. జేసీబీలు, డిజాస్టర్ టీంతో సహా పటేల్ గూడకు అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్, హైడ్రా అధికారులు చేరుకున్నారు. -
Minister Tummala Nageswara Rao: పత్తి కొనుగోళ్లపై మంత్రి కీలక సూచనలు
తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. -
CM Revanth Reddy: రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు..
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. -
Hyderabad: ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం
రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
Mulugu: ములుగు జిల్లాలోని ఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణ.. కారణం ఇదే..
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు. -
Hyderabad: దారుణం.. ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్ నగర్ లో చోటుచేసుకుంది. కొద్ది నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యువతి పై కత్తితో దాడి చేయగా.. ఆమె చేతికి, తలకు కత్తి గాయాలయ్యాయి. గాయాల పాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. -
Tiger Wandering: అలర్ట్.. దర్జాగా రోడ్డు దాటిన పెద్దపులి.. ఎక్కడంటే?
జాతీయ రహదారిపై పులి కనిపించింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటింది. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు.. హడలెత్తిపోయారు. కారు, లారీ లో ప్రయాణిస్తున్న డ్రైవర్లుసెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!