కుల గణనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సూచన చేయాలనుకున్నట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తెలిపారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు.. పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే భూములు కొని ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. అలాంటి పరిస్థితిలో.. కుల గణనతో ఇబ్బంది వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. గజిబిజి లేకుండా సాఫీగా జరగాలని సూచించారు. సుప్రీం కోర్టు 50 శాతం రిజ్వేషన్లను మాత్రమే అంగీకారం ఇచ్చాయని.. కుల గణనతో రిజర్వేషన్ పెంచాలని అనుకున్న కోర్టుల్లో ఇబ్బంది పడుతుంది అనే అనుమానం ఉందన్నారు. గ్రామాల్లో అలజడి వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. కులం తెలుసుకోవాలని అనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయని.. కుల గణన ని గెలికి.. అలజడి క్రియేట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. మంచి వాతావరణం చెడగొట్టిన వాళ్ళ అవుతారన్నారు.
READ MORE: Bangladesh : పెరుగుతున్న సలహాదారులు.. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో తిరుగుబాటు
మోడీ బీసీ నే కదా..? ఆయన మంచి పాలనా చేస్తున్నారు కదా అని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అడిగారు. కుల గణన మంచిది కాదేమో జాగ్రత్త అని సూచించారు. ఎస్సీ వర్గీకరణ కూడా సరికాదని.. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన వయసుకు తగిన బాధ్యత కాదని.. ఐనా బాగా పరిపాలన చేస్తున్నారని మెచ్చుకున్నారు. మూసి క్లీన్ చేయడం అవసరం.. దాన్ని కడిగి పారేయక పోతే కష్టమన్నారు.