ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తేదీన తుది గడువుని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మంగళవారం ట్విస్ట్ నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నివాసానికి రాష్ట్ర అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరుకున్నారు.
ప్రస్తతం కాలంలో యూట్యూబ్ యాప్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే.. యావత్తు ప్రపంచమంతటా ఈ యాప్ కు అంతలా ఆదరణ ఉంది. ముఖ్యంగా ఎక్కడలేని వింతాలు,విశేషాలు, వంటకాలు, వినోదాలు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమాచారాలను వీడియోల రూపంలో అందించడానకిి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది ఈ యూట్యూబ్.
కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. భారత్ లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి.
పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు.
ప్రజలు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పరిపాలన దక్షుడు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కటం అదృష్టమన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఓ వైపు కేంద్రం కసరత్తు మొదలు పెడుతూనే మరోవైపు రకరకాల వ్యూహాలకు సంబంధించి రౌండ్ సమావేశాలు కూడా సాగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో ఆదివారం భారీ సమావేశం జరిగింది.
రాష్ట్రంలో రుషికొండ భవనాల వివాదం నడుస్తోంది. ఆ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం ఆ భవాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియా, మీడియా ఛానెల్ లలో వైరల్ గా మారాయి.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్లో ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, లోయలో దాని పునరుద్ధరణను నిరోధించాలని షా భద్రతా బలగాలకు సూచించారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. మార్పుల అనంతరం మార్కెట్లోకి కొత్త ఎడిషన్ విడుదల చేసింది. “బాబ్రీ మసీదు” అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అదనంగా, అయోధ్య అధ్యాయం నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించబడింది.