GHMC: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఈ రోజు (సోమవారం) చివరి రోజుగా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గత ఆరు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందులో రెండు నామినేషన్లు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి చెందిన కార్పొరేటర్లు దాఖలు చేయగా, మిగిలిన రెండు కాంగ్రెస్ పార్టీకి చెందిన […]
Gold Mines: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఉన్న ఓ బంగారు గని శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, గనిలో ఇంకా […]
Viral Video: మధ్యప్రదేశ్ లోని శియోపూర్ జిల్లాలో పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారుడైన 25 ఏళ్ల వరుడు పెళ్లి ఊరేగింపు (బారాత్) సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూశాడు. సంప్రదాయ ప్రకారం గుర్రం పై ఊరేగిస్తూ వెళ్తుండగా, పెళ్ళికొడుకు అకస్మాత్తుగా కిందపడిపోయాడు. దానితో ఆనందోత్సాహంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా విషాద వాతావరణంగా మారిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. Read Also: ACB Fake […]
ACB Calls: ఏసీబీ పేరుతో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ డీజీ అధికారికంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించకుంటే కేసు పెడతామని భయపెట్టే వారి మాటలను నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే సంబంధిత అధికారులకు […]
Warangal: వరంగల్ నగర అభివృద్ధికి సహాయం చేయాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం వేద బ్యాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. Read also: Dowry Harassment: నవ వధువుకు కట్నం వేధింపులు.. 5 కోట్లు ఇచ్చినా..! వరంగల్ నగర అభివృద్ధికి […]
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబికుల మధ్య ఆర్థిక వివాదం ప్రాణహానికి దారితీసింది. ఇటీవలే జేసీబీ కొనుగోలు చేసారు గోపాల్, అతని బామ్మర్ది సురేష్. అయితే గోపాల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం బామ్మర్ది సురేష్ ను హత్య చేశాడు. జేసీబీ పూర్తిగా తన సొంతమవుతుందని భావించిన సురేష్, కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తన బావ గోపాల్ను నమ్మించి, మద్యం తాగుదామని పిలిచాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కూడా […]
Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర […]
POCO C75 5G: పోకో తన కొత్త ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్ఫోన్ పోకో C75 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. భారీ డిస్ప్లే, పవర్ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఎనిమిది వేల కంటే తక్కువ ధరలో లభించడం ఈ ఫోన్కి అదనపు ఆకర్షణ. పోకో C75 5G 4GB […]
SangaReddy: సంగారెడ్డి జిలా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఘోరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని పాశవికంగా హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట మండలానికి చెందిన దశరథ్ (26) హత్యకు గురైన బాధితుడు. అతను నిందితుడు గోపాల్ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని గోపాల్ సహించలేకపోయాడు. దీంతో అతనిపై కోపంతో దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ […]
Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. వీరు చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు పంపుతూ డబ్బులు […]