ఇటీవల కాలంలో దేశంలో వరుసగా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు హ్యాకర్ల బారిన పడుతున్నాయి. తాజాగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ శనివారం అర్ధరాత్రి హ్యాకింగ్‌కు గురైంది. దీంతో సాంకేతిక నిపుణులు ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. దేశంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే సాయం చేయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. ఈ నెల 19నే ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. Read Also: తెలంగాణకు కేంద్రం […]
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కేసు బయటపడింది. మంకీ ఫీవర్ అంటే కోతుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. ఇది వైరల్ జబ్బు. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణం సంభవించే అవకాశాలున్నాయి. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. Read […]
ప్రపంచ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ ఇంకో రెండు నెలల్లో మొదలు కానుంది. ఐపీఎల్ 15వ సీజన్‌ను ఈ ఏడాది కాస్త ముందుగానే.. అంటే మార్చి నెలాఖరులోనే ప్రారంభించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించారు. స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని… కరోనా కేసులు అదుపులోకి రాని పక్షంలో లీగ్‌ను మరోసారి విదేశానికి తరలించక తప్పదన్నారు. భారత్‌లోనే లీగ్ జరగాలని అన్ని ఫ్రాంచైజీల యజమానులు […]
కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు విధిస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 525 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరుకుంది. Read Also: […]
తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయని పేర్కొంది. అటు తెలంగాణలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకోవడంతో తెల్లవారినా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. దట్టమైన పొగమంచు కప్పేయడంతో వాహనదారులకు రోడ్లు కనిపించక ఇక్కట్లు పడుతున్నారు. Read Also: కరోనా కాలం.. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య శనివారం […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత భీకర స్థాయిలో ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇవే ఆంక్షలు స్వయంగా ఓ దేశ ప్రధాన మంత్రి వివాహాన్ని అడ్డుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి న్యూజిలాండ్‌లో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. Read Also: గిన్నిస్ […]
మేషం: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. వృషభం: చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిథునం: చేపట్టిన పనులు మందకొడిగా […]
అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. శనివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేశారు. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన యువ భారత్.. గ్రూప్-బిలో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో విశ్వరూపం చూపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… ఉగాండాపై 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు చేసింది. Read Also: టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాజ్ బవా 108 […]
గుడివాడలో క్యాసినో వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానిని ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయగా… ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో క్యాసినో జరగకపోయినా జరుగుతోందని 420 గాడు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని పరుషంగా మాట్లాడారు. కులసంఘాలను, 420 మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం […]
చలి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వేశాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం నాడు అలీగఢ్, ఘజియాబాద్ మధ్య దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఆలస్యానికి కారణమైంది. Read Also: కరోనా కాలం.. ప్రతి నలుగురిలో […]