గుడివాడలో క్యాసినో వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానిని ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయగా… ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో క్యాసినో జరగకపోయినా జరుగుతోందని 420 గాడు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని పరుషంగా మాట్లాడారు. కులసంఘాలను, 420 మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని.. ఇదే మాటను రోజుకొకరు ఆరోపిస్తే వాడింట్లోకి వెళ్లి చూపించడానికి అనుమతిస్తాడా అని కొడాలి నాని ప్రశ్నించారు.
చంద్రబాబుకు సిగ్గు శరం లేదని మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారం చేయడంలో చంద్రబాబు, లోకేష్ దిట్ట అన్నారు. లోకేష్ స్విమ్మింగ్ ఫూల్‌లో బట్టలు లేకుండా అమ్మాయిలతో సరసాలు ఆడలేదా అని కొడాలి నాని నిలదీశారు. మరి అలాంటి వాడికి మూడు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలను సీఎం జగన్ నమ్మరని.. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని చంద్రబాబు, ఆయన మీడియా కలలు కంటున్నారన్నారు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడని.. ఇప్పుడు క్యాసినో పేరుతో తనకు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
గొడవ జరిపించడానికి మాత్రమే క్యాసినోపై ఓ కమిటీ వేసి అందులో ముగ్గురు దళితులు, ఇద్దరు కాపులు, ఇద్దరు బీసీలు, ఓ మహిళను చంద్రబాబు పంపాడని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. తనకు 21 ఏళ్ల వయసులో తన తండ్రి చనిపోయారని.. తన తండ్రి ఎలాంటి వార్డు మెంబర్ కాదని.. అయినా తాను మంత్రి స్థాయికి ఎదిగానంటే అదంతా తన కష్టమని కొడాలి నాని వివరించారు. చంద్రబాబు లాంటి 420 గాళ్లను తన చిన్నతనం నుంచి చాలా మందిని చూశానని.. అలాంటి వాళ్లను చూసి తాను బెదిరిపోయే రకాన్ని కాదన్నారు.