మ్యూజిక్ డైరెక్టర్ వీణాపాణి కుమార్తెకు సినీ ప్రముఖుల ఆశీస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్‌లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె మారుతీ సాయిలక్ష్మీ వివాహం భాను రాజీవ్‌తో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేశ్ పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. నటులు, దర్శకులు, రచయితలు తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, జనార్థన మహర్షి, సింగర్ రేవంత్, కమెడియన్ శివారెడ్డి తదితరులు పాల్గొని వివాహ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి దంపతులు, వోగోటి వెంకట మారుతీ రామకృష్ణ దంపతులు తమ పిల్లల వివాహ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందించిన ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.






Also Read
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
- Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్'కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్‌ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!