జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి రెచ్చిపోయి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి, నా వ్యక్తిగత జీవితంపైనే విమర్శలు చేస్తున్నారని.. సమాధానాలు చెప్పడం వైసీపీ నాయకులకు రాదని.. వైసీపీ వాళ్లు మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకుంటారు..? అరవడం తప్ప..’ అంటూ పవన్ వైసీపీ నాయకులపై కామెంట్స్ చేశారు. ‘వివేకా హత్య కేసుపై అడిగితే.. నా వ్యక్తిగతం గూర్చి మాట్లాడుతున్నారు. […]
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ మాట్లాడుతూ.. ‘సినిమాలంటే నాకు ఇష్టం.. నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి.. సినిమా పరిశ్రమను తక్కువ చేయడం లేదు.. కానీ, రాజకీయాల్లోకి నచ్చి వచ్చా.. నేను సినిమా హీరోను కాదు.. నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ, సాటి మనిషికి అన్యాయం జరిగితే.. స్పందించే గుణం నాలో ఉంది.. మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి.. ప్రజాస్వామ్య […]
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ ను నేడు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వైసీపీ గ్రామసింహాలు అంటూ ప్రసంగం పవన్ ప్రసంగం ప్రారంభించారు. గ్రామసింహాలంటే.. కొన్ని నిఘంటువుల ప్రకారం.. ఎక్కువ వాగి పళ్లు రాలగొట్టించుకొనే కుక్కలు అంటూ పవన్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తా.. కులాల చాటున దాక్కుంటే లాకొచ్చి కొడతా.. గుంటూరు బాపట్లలో పుట్టినవాడిని నాకు బూతులు రావా..? రాజకీయాల్లో […]
ప్రముఖ దర్శకుడు ఆర్. పార్తీబన్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించిన పార్తీబన్ ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా మారాడు. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ అనే థాట్ ప్రొవోకింగ్, థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమా తెలుగులో బండ్ల గణేశ్ హీరోగా ‘డేగల బాబ్జీ’ పేరుతో రీమేక్ అవుతోంది. అంతేకాదు… ఈ మూవీ కథ నచ్చిన బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ చెన్నయ్ […]
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న టెర్రర్ మీడియా థ్రిల్లర్ ‘థమాకా’ మూవీపై అతని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ మధ్వానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు బేస్ 2013లో వచ్చిన కొరియన్ మూవీ ‘ది టెర్రర్ లైవ్’. ఓ బ్రిడ్జ్ ను బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టుని యంగ్ జర్నలిస్ట్ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు. దాంతో అతనికి బెదిరింపులు రావడం మొదలవుతుంది. ఊహించని ఈ ఉపద్రవం నుండి ఆ జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు […]
‘మా’ ఎన్నికలు ఆక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ‘మా’పోటీదారుల హాట్ హాట్ కామెంట్స్ తో చర్చనీయాంశంగా మారగా.. తాజాగా నటుడు నరేష్, మంచు విష్ణు పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. నరేష్ మాట్లాడుతూ.. ‘మంచు విష్ణుకి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. ఆయననే అయితేనే మాకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. మా మసకబరింది అని కొందరు కామెంట్ చేసినప్పుడు మసక బారలేదని చెప్పాను. ఎవరు పడితే వారు ‘మా’ సీటులో కూర్చుంటే […]
(సెప్టెంబర్ 29న ఖుష్బూ బర్త్ డే) ముద్దుగా బొద్దుగా సిమ్లా ఆపిల్ పండును గుర్తు చేస్తూ తెరపై కనిపించి ఊరించింది నటి ఖుష్బూ అందం. ఇప్పుడంటే మరింత భారీగా మారి, కేరెక్టర్ రోల్స్ లో కనువిందు చేస్తున్నారు కానీ, అప్పట్లో ఖుష్బూ అందం అనేక చిత్రాలలో చిందులు వేసి కనువిందు చేసింది. ఉత్తరాదిన ఉదయించిన ఖుష్బూ అందం, దక్షిణాది చిత్రాలతోనే వెలుగులు విరజిమ్మింది. తమిళ చిత్రసీమలో అనేక ఘనవిజయాలను చూసింది ఖుష్బూ. తమిళ జనం ఖుష్బూకు గుడి […]
(సెప్టెంబర్ 29న యన్టీఆర్ ‘అడుగుజాడలు’కు 55 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్, నటచక్రవర్తి యస్వీఆర్ డాక్టర్లుగా నటించిన చిత్రం ‘అడుగుజాడలు’. తాపీ చాణక్య దర్శకత్వంలో నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.సాంబశివరావు, జి.వందనం ‘అడుగుజాడలు’ నిర్మించారు. ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966 సెప్టెంబర్ 29న ఈ సినిమా విడులయింది. ‘అడుగుజాడలు’ కథ విషయానికి వస్తే- డాక్టర్ కృష్ణ ఎంతో మేధావి. తన వైద్యంతోనూ, మంచితనంతోనూ దుర్మార్గులను సైతం సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. పోలియోకు అప్పట్లో తగిన వైద్యం […]
తెలుగు చిత్రసీమలో చాలా అంశాలు చరిత్రకు అందక దూరంగా నిలిచాయి. అసలు మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఎప్పుడు విడుదలయిందో మొన్నటి దాకా చాలామందికి తెలియదు. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలయిందని చాలా రోజులు సాగింది. అయితే లభిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6 విడుదలయింది. అలాగే మన తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయకుడుగా ఎమ్.ఎస్. రామారావును, తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతీదేవిని చెప్పుకుంటూ […]