చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనలలో ప్రభుత్వం పెద్ద సడలింపులు ఇచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్ నియమాలలో మార్పులు చేశారు. ఓ నివేదిక ప్రకారం.. ఈ నిబంధనలలో మార్పుల కోసం ప్రభుత్వం నవంబర్ 9న గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 9 రకాల చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది.
వరల్డ్ కప్ 2023 లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా పాకిస్తాన్ బౌలర్ హ్యారీస్ రవూఫ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్ లీగ్ స్టేజిలో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రవూఫ్ నిలిచాడు. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును సాధించాడు. వరల్డ్‌కప్ 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్ అందరి బౌలర్ల కంటే ఎక్కువగా 533 పరుగులిచ్చాడు.
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను వేధించాడని స్నేహితుడిని అతి దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు. మృతుడి మొబైల్ ద్వారా వివరాలు సేకరిస్తారని దానిని బావిలో పడేశాడు. మృతుడు సైన్యంలో పనిచేసి రిటైరయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని కార్యక్రమంలో మాలిక్ చెప్పాడు.
సాధారణంగా పెంపుడు జంతువులను కార్లలో కానీ, బైకులపై కానీ ఎక్కించుకుని పోతుంటాం. అంతేకాకుండా ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు కూడా వాటిని వదిలి ఉండలేక తమతో పాటు బస్సుల్లో, కార్లలో, బైకులపై తీసుకెళ్తారు. కానీ ఓ వ్యక్తి భారీకాయం ఉన్న ఎద్దును తన బైక్ పై ముందు కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. ఆ వీడియోలో అనుష్క శర్మ.. వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. అంతేకాకుండా.. ఆమే తన బేబీ బంప్ ను దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది.
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం బయటపడింది. ఇంతకుముందు వీరి మధ్య జగడం ఉన్నప్పటికీ మళ్లీ బట్టబయలైంది. వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలపై స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రోమోలో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించిన ప్లేయర్స్ ను చూపించారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఫేవరేట్స్ లో ఒక జట్టుగా బరిలోకి దిగిన పాకిస్తాన్ తగినంత రీతిలో రాణించకపోవడంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్ అనంతరం బాబర్ అజామ్ వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని కొన్ని మీడియా కథనాలలో పేర్కొంది.