Collections: ‘బాహుబలి-2’వసూళ్ళను ‘కేజీఎఫ్-2’ దాటలేదు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్-2’ సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఈ సినిమా హిందీ వర్షన్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’, ‘ట్రిపుల్ ఆర్’ హిందీ సినిమాల కన్నా మిన్నగా వసూళ్ళు చూసిందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘కేజీఎఫ్-2’ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల వారాంతం చూసింది. అందువల్ల మొదటి రోజునే భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.53.95 కోట్లు పోగేసింది. కానీ, 2017 ఏప్రిల్ 28న విడుదలైన ‘బాహుబలి-2’, ఈ యేడాది మార్చి 25న జనం ముందు నిలచిన ‘ట్రిపుల్ ఆర్’ రెండూ శుక్రవారం రోజున విడుదల కావడం గమనార్హం!
ఐదేళ్ళ క్రితం విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రం మొదటి రోజున రూ. 41 కోట్లు రాబట్టింది. ఈ యేడాదే జనం ముందుకు వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ ఫస్ట్ డే రూ. 20.07 కోట్లు మాత్రమే చూసింది. ఇక ‘కేజీఎఫ్-2’ రెండవ రోజు శుక్రవారం రూ. 46.79 కోట్లు కొల్లగొట్టింది. అలా చూసినా ‘కేజీఎఫ్-2’ ఆ రెండు చిత్రాల కంటే ఎక్కువగా ఉన్నట్టే లెక్క. అయితే ఐదు సంవత్సరాల క్రితం రేట్లకు, ఇప్పుడు రేట్లకు తేడా ఉన్న మాట వాస్తవం. దాదాపు 50 శాతం రేట్లు పెరిగినట్లు అంచనా. ఇక ఆ రోజుల్లోనే ‘బాహుబలి-2’ మొదటి రోజు 41 కోట్లు పోగేసిన విషయాన్ని మర్చిపోరాదు.
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
సరే ఆ లెక్కలు ఎలా ఉన్నా, పది రోజులకు ‘కేజీఎఫ్-2’ రూ. 298.44 కోట్లు రాబట్టింది. ‘బాహుబలి-2’ పది రోజులకు రూ. 327.75 కోట్లు కొల్లగొట్టింది. అదీ ఐదేళ్ళ క్రితం. ఇక ‘ట్రిపుల్ ఆర్’ పది రోజులకు రూ. 184.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ టోటల్ రన్ లో రూ.510.99 కోట్లు మూటకట్టింది. ‘కేజీఎఫ్-2’ రాబోయే వారాంతానికి రూ.350 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. ఆ తరువాత ఎంత పోగేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ పది రోజుల కలెక్షన్ కంటే ‘కేజీఎఫ్-2’ పదిరోజుల వసూళ్ళు రూ. 113.69 కోట్లు అధికం అన్న మాట వాస్తవం! అయితే అదే టైమ్ లో ‘కెజిఎఫ్2’ పది రోజుల వసూళ్ళ కంటే ‘బాహుబలి2’ పదిరోజులకు 29.31 కోట్లు అధికంగా వసూలు చేయటం విశేషం. అదీ నాలుగేళ్ళ క్రితం. ఈ లెక్కన ‘బాహుబలి2’ పూర్తి స్థాయి వసూళ్ళను చేరుకోవడం ‘కెజిఎఫ్2’కి కష్టమే. మరి టోటల్ రన్ లో ‘కేజీఎఫ్-2’ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?