కోవిడ్ 19 మలిదాడి తీవ్రమవుతున్న వేళ. తెంగాణతో సహా రాష్ట్రాలు పరిమిత లాక్‌డౌన్లు కర్ఫ్యూు ఇతర ఆంక్షలు విధిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయంలో మోడీ మాట్లాడుతున్నారంటే దేశమంతా చెవులు రిక్కించి వినేది. టీవీ సెట్ల ముందు జనం గుమికూడేవారు. కాని ఇప్పుడు రెండవసారి కరోనా దాడి తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. దవాయి భీ కడాయి బీ మందు తీసుకోవాలి,ముందు జాగ్రత్త వుండాలి అని ఆయన జాతికి మంత్రోపదేశం చేశారు గాని అదే మంత్రం ఆయన ప్రభుత్వం ఎందుకు పాటించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఈ ఒక్కరోజులో రెండున్నర లక్షలు దాటిపోవడం ఒకటైతే మరణాలు కూడా దాదాపు రెండు వేలకు చేరువయ్యాయి. అంతర్జాతీయంగా బ్రెజిల్ తర్వాత స్థానంలో వున్న భారత్ ఇప్పుడు దాన్ని దాటేసి అమెరికా తర్వాత రెండో ప్రమాద దేశంగా మారింది, కాని మరోవైపున చూస్తే ఈ వైరస్ నిరోధానికి టీకాలు గాని వ్యాధి గ్రస్తు చికిత్సకు అవసరమైన మందు గాని అందుబాటులో లేని దుస్థితి. ముందు జాగ్రత్త తీసుకుని వుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి వుండేదా? ఈ ఏడాది మార్చి9న కూడా ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ కరోనాపై పోరాటంలో విజయం సాధించామని ప్రకటించారు. మన విజయగాధ ఉత్తేజకరమైందని ప్రధాని ప్రశంసించారు. ప్రజలు మాస్కు పెట్టుకోకపోవడం వల్ల ఈ ముప్పు వచ్చిందని ఇప్పుడు నిందిస్తున్నారు గాని బిజెపిలో కీలక స్థానంలో వున్న అస్సాం మంత్రి హేమంత బిస్వాల్ మాస్కు కాలం అయిపోయిందని చెప్పేశారు.
వాక్సిన్ తయారీపైన కూడా బోలెడు హడావుడి. ప్రపంచంలో అమెరికా తర్వాత వాక్సిన్ ఎక్కువగా చేసింది మనమే గాని జనాభా రీత్యా అది ఎనిమిది శాతం మందికి కూడా చేరలేదు. మే1 నుంచి 18దాటినవాళ్లందరికీ అంటున్నారు గాని ఇప్పుడు వృద్ధులకు పెద్దవారికే లేదు.మోడీ టీకా ఉత్సవ్ అన్నప్పుడుమన జనాభా లెక్కులు తెలియవా? వాక్సిన్ ఉత్పత్తి ఏ స్తాయిలో జరుగుతుందో అంచనా లేదా? ఇప్పుడు పూనాలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు మూడు వేల కోట్లు భారత్ బయోటెక్‌కు 1500 కోట్లు సహాయం చేస్తున్న పాలకులకు గతంలో ఈ సంగతి తెలియలేదా? పైగా ప్రభుత్వ వాక్సిన్ సంస్థ ఇంటిగ్రేటెడ్ వాక్సిన్ కాంప్లెక్స్(తమిళనాడు) వంటివి వున్నా ఎందుకు ఉపయోగించుకోలేదు? టీకాపై గుత్తాధిపత్యం ప్రైవేటుకే ఎందుకిచ్చారు? వాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతప్పు కాదు గాని వాటి తయారీకి కావలసిన ముడిసరుకు అమెరికా నుంచి తెప్పించుకోలేకపోయాక మన స్నేహాలు హౌడీమోడీలు ఎందుకు ఉపయోగం? ఈసారి సెకండ్‌వేవ్‌లో ఆక్సీజన్ అవసరం చాలా ఎక్కువగా వుంటే ఇన్ని మాసాల్లో సమర్థత ఎందుకు పెంచుకోలేకపోయాము? 161 సంస్థలు ఆక్సీజన్ తయారీకి అనుమతి కోరితే కేవలం 33 దరఖాస్తు మాత్రమే అనుమతించడానికి కారణమేమిటి?కరోనాపై పోరుకు 35వేల కోట్ల నిధులు వున్నా, పిఎంకేర్స్‌లో మరో పదివేల కోట్లు వున్నా ఈ దుస్థితిని ఎందుకు నివారించలేకపోయారు?అన్నిటికన్నా కీలకం ప్రభుత్వ వైద్యశాలను పెంచాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. ఇప్పుడు తాత్కాలిక ఆస్పత్రుల గురించి ప్రధాని మాట్లాడుతున్నారు గాని అసలైన చోట్లనే సిబ్బంది లేనప్పుడు ఈ తాత్కాలికంలో ఎవరు వుంటారు? ప్రైవేటు కార్పొరేట్ దోపిడీ గతం కన్నా వికృతంగా విజృంబించడాన్ని ఎలా అనుమతించారు?శ్మశానాల్లో కూడా చోటు లేక శవాలను భద్రపరిచే అవకాశం లేక దారుణంగా తయారైన దేశ పరిస్థితికి బాధ్యులెవరు?
కరోనా నిరోధ వ్యూహం, మందు, చికిత్సకు టీకా ప్రతిదీ తన కనుసన్నల్లో సాగాని శాసించిన కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలను నిందిస్తున్నది. ముందు ఆక్సిజన్ టీకా కొరత గురించి మాట్లాడితే దాటేస్తుంది.ప్రజల అజాగ్రత్త నిజమైనా సరే వారే ఈ వ్యాప్తికి కారణమనే వాదన చేస్తున్నది. ప్రధానితో సహా రాజకీయ నేతలు భారీ సభలు జరిపి కరోనా వ్యాప్తికి కారణమైన వాస్తవాన్ని దాచేయడం సాధ్యమా? కుంభమేళాలో అఖడా ముఖ్యులంతా కరోనా బారినపడటం స్వామీజీలు ప్రాణాలు కోల్పోవడం,వేల సంఖ్యలో వైరస్ బారినపడటం గత ఏడాది మర్కజ్‌పై జరిగిన రభసను వెక్కిరించడం లేదా? ఇవన్నీ కూడా స్వయం కృతాపరాధాలు, నివారించదగినవి. మందు టీకాలు ముందుగా చూసుకోవసినవి. కాని అదే జరగలేదు.
గతంలో లాక్‌డౌన్ విధించిన దేశాన్ని స్తంభింపచేయడం చెప్పలేనిసమస్యకు దారితీసింది. ప్రజల సమస్యలు అలా వుంచి కార్పొరేట్లు వ్యాపార పారిశ్రామిక సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి, ఆర్ధిక వ్యవస్థ కూడా తకిందులైంది, అందుకే ఈ సారి లాక్‌డౌన్ ఆఖరి అస్త్రంగా వుండాని మోడీ సెలవిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ బాధ్యత కూడా లేకుండా పోతుంది. వాస్తవంలో మార్కెట్లు దుకాణాల నుంచి థియేటర్ల వరకూ మూత పడుతున్న స్థితిలో పనులు లేకుండా పోతాయి. చేసినా జీతాలు రావు. ఇప్పటికే కుటుంబాల్లో అనేక మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కరోనా మలిదెబ్బ వూహించిన దానికంటే తీవ్రంగా వుండబోతుంది. కేంద్రం,అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే మాత్రం వాటి స్పందన సాయంగతసారి కన్నా తక్కువగానవుండబోతున్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తం కాకతప్పదు.