చైనా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన విడిభాగాలను తీసుకొని లాంగ్ మార్చ్ 5 బీ అనే ఇటీవలే ఆకాశంలోకి దూసుకుపోయింది. అంతరిక్ష కేంద్రంలోని కొర్ మాడ్యులోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అప్పటి నుంచి ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది. భూమిపై ఏ ప్రాంతంలో ఈ రాకెట్ కూలిపోతుందో అని భయపడ్డారు. ఈరోజు ఉదయం ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత మండిపోయింది. దాని శకలాలు జనావాసాలపై కాకుండా హిందూ మహా సముద్రంలో పడిపోయాయి. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.