రోజు రోజుకి ట్రంప్ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా మంగళవారం ట్రంప్ సివిల్ వ్యాపారం పైన న్యూయార్క్ న్యాయమూర్తి నిషేధాజ్ఞలు జారీ చేశారు.
రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
ప్రధాని మోడీ గతంలో పార్టీ నేతల మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లెక్కలు బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ దీని గురించి గళం విప్పారు.
చిన్న తనంలోనే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.. ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తా నా స్వార్ధం కోసం చేయను.. మంత్రిగా ఉండి పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించ కముందే ఈ భేటీని అత్యంత కీలకంగా భావిస్తుంది.
Vijayashanti: మూడు రోజుల గ్యాప్లో ప్రధాని మోడీ రెండుసార్లు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న పాలమూరులో పర్యటించిన ప్రధాని అక్టోబర్ 3న ఇందూరులో పర్యటించారు.
Bathukamma Sarees: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. తెలంగాణలో దసరా పెద్ద పండుగ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను పేర్చి గౌరమ్మను మహిళలు పూజిస్తారు.