తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ కె ఫాస్ట్ పుడ్ వద్ద అదుపు తప్పిందో కారు. పార్క్ చేసిన బైక్ లపై దూసుకెళ్ళింది కారు. ఈ ప్రమాదంతో ఎనిమిది బైక్ లు ధ్వంసం అయ్యాయి. కారు టైర్ పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. నిత్యం రద్దీగా వుండే రహదారిపై కారు బీభత్సంతో పరుగులు తీశారు పాదచారులు. ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చి కారుని అక్కడినించి తొలగించారు.
కరోనా పుట్టినిల్లు అయిన చైనాకు సమస్యలు తప్పడం లేదు. ఒక సమస్యపోతే మరో సమస్య చైనాను వెంటాడుతోంది. తాజాగా అక్కడ కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీనికోసం చైనా ఆంక్షలు విధిస్తుంది. ఈ సమస్య సమసిపోక ముందే ఆ దేశంలో భారీ కాలు ష్యంతో బీజింగ్‌లోని రహదారులు, పాఠశాలు, ఆటస్థలాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా ఇటీవల విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు వినియోగాన్ని పెంచడమే కారణంగా కనిపిస్తుంది. ఇటీవల బొగ్గు కొరతతో ఆదేశంలో విద్యుత్ […]
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు చంద్రబాబు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం […]
జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకోవడంతో ఆ షోరూంకి వెళ్ళాలంటేనే యువతులు భయపడుతున్నారు. ఈ షోరూంపై కేసు నమోదు కావడంతో హెచ్ అండ్ ఎం షోరూం క్లోజ్ చేశారు నిర్వాహకులు. ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ రూం నుంచి ఇద్దరు యువకులు మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్నఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి.. చాకచక్యంగా వ్యవహరించి ఆ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. […]
న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతిలో రైతులు సాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని ఉద్యమం రైతులది కాదు. టీడీపీ కార్యకర్తలదే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చెరకు రైతులకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని, ఎన్‌సిఎస్ సుగర్స్‌కు చెందిన 24 ఎకరాలను వేలం వేసి ఆ సొమ్ముతో బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్‌సిఎస్ సుగర్స్ పై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తాం. ఫ్యాక్టరీ భూములను విక్రయించి, రైతుల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తాం. రూ.10కోట్లు విలువైన పంచదారను […]
సమర్ డియాజ్ అనే 24 ఏళ్ల మహిళ ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. గాయం తీవ్రం కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు తీవ్రంగా శ్రమించి వైద్యం అందించారు. రెండు వారాల తరువాత ఆమె కోమానుంచి కోలుకున్నది. సాధారణంగా కోమాలోకి వెళ్తే గతాన్ని మర్చిపోతారు. వివిధ థెరిపీల ద్వారా గతం గుర్తుకు వస్తుంది. కొంతమంది మాట మర్చిపోతే స్పీచ్ థెరిపీ ద్వారా మాట తెప్పిస్తుంటారు. అయితే సమర్ డియాజ్ విషయంలో అన్నింటికి మించి జరిగింది. […]
మొబైల్ ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే అత్యవసరంగా వినియోగించుకునేందుకు పవర్ బ్యాంక్‌లను వినియోగిస్తుంటారు. పవర్‌బ్యాంక్‌లను ఒకసారి ఛార్జింగ్ చేసి దానిని మొబైల్‌కు కనెక్ట్ చేస్తే మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గత కొంతకాలంగా పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లతో పాటుగా, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగింది. Read: శతాబ్దం చివరినాటికి… భూవినాశనం తప్పదా… పెట్రోల్, డీజిల్ […]
ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇటీవలే గ్లాస్కోలో కాప్ 26 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా భూతాపం, ఉద్గారాలను తగ్గించేందుకు ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఎలా వాతావరణంలో వేడిని తగ్గించవచ్చు అనే విషయాలపై చర్చించారు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ శతాబ్ధం చివరినాటికి పర్యావరణ విపత్తులు సంభవించే అవకాశం ఉందని, దీని వలన భూవినాశనం తప్పదని చెబుతున్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ అనే […]
అమెజాన్ సంస్థ అంతరిక్షరంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ సంస్థ ఇటీవలే అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహించింది. కమర్షియల్‌గా వ్యోమగాములను స్పేస్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఐఎస్ఎస్కు కావాల్సిన సరుకులను చేరవేస్తూ అందరికంటే ముందు వరసలో ఉన్నది. ఇక ఇదిలా ఉంటే చంద్రుడిమీదకు వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేస్తున్నది. Read: వైరల్: పాస్‌పోర్ట్ […]
ఆన్లైన్ షాపింగ్ రంగం అభివృద్ది చెందిన తరువాత చిన్న చిన్న వాటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వాటిపై ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. కేరళకు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి పాస్‌పోర్ట్ కవర్‌ను ఆన్లైన్లో బుక్ చేశాడు. బుక్ చేసిన కవర్ ఇంటికి వచ్చింది. పార్శిల్ కవర్‌ను ఒపెన్ చేసి చూసి మిథున్ […]