లంచానికి అలవాటు పడ్డ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతు వద్ద 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు విద్యుత్ శాఖ ఏఏఇ రాజ్ కుమార్. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన రైతు షౌకత్ అలీ తన పొలానికి మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఏఇని కోరాడు. అయితే, అలా చేయడానికి లంచం డిమాండ్ చేశాడు విద్యుత్ […]
కరోనాకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ స్పూత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ చిన్నపిల్లలకు ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే జైడస్ వ్యాక్సిన్ ఉన్న అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. ఈ క్రమంలోనే భారత్‌బయోటెక్ మరో ముందడుగు వేసి శుభవార్తను చెప్పింది. భారత్ బయోటెక్ యూఎస్ భాగస్వామి ఆక్యూ జెన్ చిన్నపిల్లలకు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని యూఎస్ అధికారులను కోరింది. 2నుంచి18ఏళ్ల మధ్య వయస్సున్న వారికి ఈ వ్యాక్సిను అత్యవసర వినియోగానికి దరఖాస్తు […]
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు పెరుగుతున్నారు. కొండపై వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి కూడా ఎక్కువగానే వుంది. నవంబర్ 13,14,15వ తేదీలలో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. వీఐపీల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు […]
ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ చేసిన నిర్వాహకానికి దిక్కు తోచని స్థితిలో పడ్డారు వలస కూలీలు.. ప్రైవేట్ బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రయాణికు లను నిలువు దోపిడి చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరు స్తానని నమ్మించి మార్గ మధ్యలోనే వారి లగేజీలతో ఊడాయించాడు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో చోటు చేసుకుంది. కేరళ నుంచి అసోంకు 65 మంది వలస కూలీలు ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నారు. నార్కెట్ పల్లి శివారు జాతీయ […]
తెలంగాణలో జరిగిన ఒక ఉప ఎన్నిక జాతీయ పార్టీ కాంగ్రెస్ ని కుదిపేస్తోంది. పార్టీ పరాజయం నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత నెల 30 జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అక్కడ డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ పరువు పోయిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు సైతం ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టుమార్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం […]
2021 సంవత్సరానికి గాను డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కా రాలను నిర్వాహకులు ప్రకటించారు. విశిష్ట పురస్కారాలు ..భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలు డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లకు దక్కింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గ పద్మజా, ప్రముఖ సినీ పాత్రికేయుడు ఎస్వీ రామారా వులకు విశేష సేవా పురస్కారం దక్కింది.త్వరలోనే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. అయితే, 2020 సంవత్సరానికి సైతం అవార్డులను ప్రకటించామని,లాక్డౌన్ […]
హైదరాబాద్ పోలీసులు పేకాట స్థావరాలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. మంచిరేవులలో ఓ సినీనటుడి ఫాం హౌస్‌లో దాడుల తర్వాత పేకాట రాయుళ్ళ పని పడుతున్నారు. బేగంపేటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిర్వాహకుడు అరవింద్ అగర్వాల్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశామని బేగంపేట పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బేగం పేట పేకాట కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అరవింద్‌తో పాటు వ్యాపారవేత్తలు జాఫర్ హుస్సేన్, సిద్దార్థ్ అగర్వాల్, బగీరియా సూర్యకాంత్, అబ్దుల్ […]
రాజన్న సిరిసిల్ల జిల్లా… పోడు భూముల పై అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు రమేష్ బాబు,రసమయి బాల కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అడ వుల ను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిరి సిల్ల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో 4 లక్ష72 వేల 329 ఎకరాలు భూమి ఉందన్నారు. దీన్లో 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. 2005-06 కేంద్రం ఆర్ ఓ.ఎఫ్ ఆర్ చట్టాన్ని తీసుకు […]
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మద్ నగర్‌లోని సివిల్ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులోనే ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో కాలిపోయి కొందరు.. దట్టమైన పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. ఇప్పటి వరకు 10 మంది కోవిడ్ రోగులు మరణించినట్లు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని వివిధ ఆస్పత్రుల్లో గత కొంతకాలంగా జరుగుతున్న మరణాలు […]
ఇప్పటికే కరోనాతో ప్రజలు అల్లాలాడిపోతుంటే మరో వైపు కాలుష్యంతో ఇతర సమస్యలు వచ్చిపడుతున్నాయి. తాజాగా దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందన్నారు. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమ స్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కాలుష్యం అధికంగా ఉన్న గాలిలో వైరస్ ఎక్కువ కాలం బతికి ఉంటుం దన్నారు. దీని వల్ల కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను ఆయన హెచ్చరించారు. ప్రజలు కాలుష్యం […]