NTV WebDesk
Author- NTV Telugu-
Monitor Lizard: ఆ బల్లిని చూసి యువతి కుర్చీ ఎక్కేసింది… చివరకు…
రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆమెకు బల్లిజాతికి ఓ పెద్ద ఉడుము కనిపించింది. భయపడిన ఆ యువతి వెంటనే అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చి ఎక్కింది. పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులకు భయపడిన ఆ ఉడుము ఆ యువతి మీదకు దూకే ప్రయత్నం చేసింది. దీంతో మరింత బిగ్గరగా అరడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకు వచ్చి దానిని అక్కడి నుంచి తొలగించే […] -
Quarantine Rules: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్: క్వారంటైన్‌పై కీలక నిర్ణయం…
కరోనా మహమ్మారి విషయంలో కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్షన్‌ను పక్కన పెట్టింది. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. ఏడు రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో రెండు వారాల ట్రావెల్ హిస్టరీ […] -
TRS Privilge motion: ప్రివిలైజ్ మోషన్ పై తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో […] -
Up Cm Yogi: యోగి సమర్ధుడు… మాజీ డీజీపీ ప్రశంసలు
ఎన్నికలు జరుగుతున్న యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ ముఖ్యమంత్రి యోగిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి యోగి నిష్కళంకుడు. ఏ మాత్రం అవినీతి మచ్చలేని సమర్ధుడైన నాయకుడు. రాష్ట్ర హితం, దేశ హితం కోసం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అన్నారు ప్రకాశ్ సింగ్. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లో అన్సారీ చీకటి సామ్రాజ్యాన్ని యోగి ప్రభుత్వం ధ్వంసం చేసింది. అలా ఎంతోమంది గూండా గిరి చేసిన వాళ్లందరినీ యోగి ప్రభుత్వం […] -
Ukraine Crisis: రష్యాను దాని నుంచి పక్కకు తప్పించనున్నారా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సమస్య రోజురోజుకు జఠిలం అవుతున్నది. క్రియాను రష్యా అక్రమించుకున్నాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా భారీ ఎత్తున సైన్యాన్ని ఆయుధాలను మోహరించింది. అయితే, ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా నాటో దళాలు రంగంలోకి దిగాయి. నాటో దళాలు రంగంలోకి దిగడంపై రష్యా స్పందించింది. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని, నాటో దళాలతో పోలిస్తే రష్యా సైన్యం తక్కువే అని, కానీ, అణ్వాయుధవ్యవస్థ బలంగా ఉన్న దేశం రష్యా అని అధ్యక్షుడు […] -
Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
పీఆర్సీ విషయంలో జనసేనపై, తనపై చేస్తున్న కామెంట్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై. పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను ప్రజల దత్తపుత్రుడిని అన్నారు పవన్. మంత్రులే ఉద్యోగులను రెచ్చగొట్టారు.ప్రభుత్వానికి అందరూ శత్రువులుగా కనిపిస్తారు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తామేదో వారిని రెచ్చగొడుతున్నట్టు వచ్చిన వార్తలపై పవన్ మండిపడ్డారు. పీఆర్సీ […] -
CRIF Sanctions: బండి సంజయ్ ప్రయత్నం..రోడ్లకు ఇక మహర్దశ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రమ ఫలించింది. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ […] -
ISRO Activities: ఇస్రోలో ఇక రయ్ రయ్ మంటూ ప్రయోగాలు
కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.సైంటిస్టులు, ఇతర ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు , 4 టెక్నాలజీ డెమానేషన్ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్ -3 కూడా ఉంది. ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగం ( పీఎస్ఎల్వీ […] -
Corona Thirdwave: కరోనా పీడ.. థర్డ్ వేవ్ ముగిసినట్టేనా?
దేశంలో హడలెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్టేనా? అవునంటున్నారు నిపుణులు. అయితే, కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవంటున్నారు. కరోనా ముగిసినా కరోనా అనంతర పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయంటున్నారు నిపుణులు. నిద్రలేమి, అలసట, డయాబెటీస్ నుంచి డిప్రెషన్ వరకు.. కొత్త సమస్యలుగా మారుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చినా ఈసారి అంతగా సీరియస్ కేసులు లేవనే చెప్పాలి. చాలామంది ఇంటిలో ఉండి వైద్యం తీసుకుని కోలుకున్నారు. కరోనా తగ్గిన తరవాత కొన్ని ఆరోగ్యపరమయిన ఇబ్బందుల వల్ల ఆసుపత్రులకు వెళుతున్నారు. కొంతమంది […] -
Jagan Vizag Tour: శారదాపీఠంలో సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. చిన ముషిడివాడలోని శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ పాల్గొన్నారు. స్వామివారు జగన్ ని ఆశీర్వదించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!