భారత్‌లో ఒమిక్రాన్ కేసులు…రోజు రోజుకు పెరుగుతున్నాయ్. క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ వేడుకలపై…పలు రాష్ట్రాలు నిషేధం విధించాయ్. గుజరాత్, మధ్యప్రదేశ్ నైట్ కర్ఫ్యూ విధించాయ్. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగంపై కర్ణాటక నిషేధం విధించింది. ఒమిక్రాన్…దేశంలో కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్ కేసులతో పాటు కొవిడ్ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ్. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని… వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన […]
ఒకసారిగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోతున్న ఓ నిండు ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు. అయితే హైదరాబాద్ చాదర్ ఘాట్ సిగ్నల్ వద్ద టూ వీలర్ పై ఓ వ్యక్తికి హార్టెటాక్ వచ్చింది. దాంతో ఒకసారిగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోతున్న వ్యక్తిని గమనించిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు… ఆయా వ్యక్తిని సమీప హాస్పిటల్ తరలించారు. వెంటనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని.. వారికీ సమాచారం అందించారు పోలీసులు. అయితే సకాలంలో స్పందించి […]
మన భారత దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు. అయితే మన ఇండియాలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా నమోదైన బంగారం ధరలు… ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల […]
‘శంకరాభరణం’ తరువాతే దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ ను అందరూ ‘కళాతపస్వి’ అంటున్నారు. అంతకు ముందు ఆయన తెరకెక్కించిన చిత్రాలను గమనించినా, వాటిలో సంగీతసాహిత్యాలకు, కళకు విశ్వనాథులవారు ఇచ్చిన ప్రాధాన్యం కనిపిస్తుంది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన హాస్యప్రధాన చిత్రంలో సైతం సాహితీవిలువలు ప్రస్ఫుటంగా కనినిస్తూ ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘సిరిసిరిమువ్వ’ తెలుగువారిని విశేషంగా అలరించింది. 1976 డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం తరువాత వచ్చిన సూపర్ స్టార్ మూవీస్ సినిమాల నడుమ సైతం […]
తెలుగు చిత్రసీమలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారం నడుం బిగించేవారిలో ముందువరుసలో ఉంటారు దగ్గుబాటి సురేశ్ బాబు. అంతకు ముందు ఆయన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కూడా అదే తీరున తెలుగు సినిమా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారు. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి సురేశ్ బాబుతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ మన తెలుగు […]
మధురామృతానికి మారు పేరు మహ్మద్ రఫీ గానం.యావద్భారతాన్నీ రఫీ పాట పరవశింప చేసింది. ఇంకా ఆనందసాగరంలో మునకలు వేయిస్తూనే ఉంది. రఫీ పాటకు తెలుగు సినిమాకు కూడా అనుబంధం ఉంది. తెలుగులోనూ మహ్మద్ రఫీ పంచిన మధురామృతం ఈ నాటికీ ఆనందం పంచుతూనే ఉండడం విశేషం. పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ సింగ్ అనే ఊరిలో మహ్మద్ రఫీ 1924 డిసెంబర్ 24న జన్మించారు. బాల్యంలో తమ ఊరిలో ఫకీర్లు తిరుగుతూ పాడే పాటలను వల్లిస్తూ ఉండేవారు […]
పురాణాల్లో భానుమతి అంటే దుర్యోధనుని భార్య అని తెలుస్తుంది. అయితే భారతంలో భానుమతి పాత్ర పెద్దగా కనిపించదు. కానీ, తెలుగు సినీభారతంలో మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు. మొదటి నుంచీ భానుమతికి ధైర్యం పాలూ ఎక్కువే. ఎదుట ఎంతటి మేటినటులున్నా, తనదైన అభినయంతో ఇట్టే వారిని కట్టిపడేసేవారు. ఇక ప్రతిభ ఎక్కడ ఉన్నా […]
టీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన DS.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పాకే కాంగ్రెస్ కండువా కప్పుకొంటారా? నైతికత కింద రాజీనామా చేస్తారా? ఇంకేదైనా వ్యూహం ఉందా? రాజకీయాల్లో చురుకైన పాత్ర కోసం చూస్తున్నారా? పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో.. కాంగ్రెస్‌లో డీ శ్రీనివాస్ చేరిక త్వరలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమై.. తిరిగి పాత గూటిలోకి వెళ్లేందుకు సమ్మతి తీసేసుకున్నారు. అయితే […]
పాశ్చాత్య చిత్ర పరిశ్రమకు హాలీవుడ్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు బాలీవుడ్ అలా. ప్రపంచం దృష్టిలో భారతీయ సినిమా అంటే హిందీ సినిమా. ఐతే, ఇప్పుడు ఆ ముద్ర చెరిగిపోతోంది. అసురన్, జైభీమ్, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్‌పై టాలీవుడ్ పై చేయి సాధిస్తోంది అని చెప్పటానికి ఉదాహరణలు. అసురన్ పలు అంతర్జాతీయ ఆవార్డులు గెలుచుకోగా.. జై భీమ్ భారీ హాలీవుడ్ సినిమాలను తలదన్ని ఇంటర్నెట్ టాపర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ఫ వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే 170 […]
ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 158 శాంపిల్స్ పరీక్షించగా.. 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,98,568 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య […]