కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా మారుతున్నాయి హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలు. హుజూరాబాద్ లో ఈటెలను వ్యతిరేకిస్తున్నారు పలువురు ప్రజా ప్రతినిధులు. హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ పలువురు కార్పొరేటర్లు ఈటెల కు వ్యతిరేకంగా తీర్మానం చేసారు. తామంతా టీఆర్ఎస్ బీ ఫార్మ్ తోనే గెలిచామని […]
బోర్డర్లో అంబులెన్స్ లను నిలిపివేయడం వల్ల జరుగుతున్న మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. చెక్ పోస్టుల వద్ద పడిగాపులు కాచి ఈరోజు అంబులెన్స్ లో ఇద్దరు రోగులు చనిపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ హై కోర్ట్ చెప్పినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకుండా కనీసం మానవత్వం చూపించడం లేదు అని విమర్శించారు. అయితే తెలంగాణలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది […]
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,693 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,16,404 కి చేరింది. ఇందులో 4,56,620 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 71,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన […]
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 96,446 శాంపిల్స్ పరీక్షించగా 22,399 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 89 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 18,638 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ […]
ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి ఆస్పత్రిలో మరణాలు సంభవిస్తున్నాయి. సిటింగ్ జడ్జి చేత విచారణ చేసి, వాస్తవాలను ప్రజల ముందుంచాలి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి… 30 మంది చనిపోతే 11 మంది అని చెప్పడం దారుణం. వాస్తవాలు చెప్పేవారిని బెదిరించి, అసత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలు మానాలి.. వాస్తవాలు ఒప్పుకోండి. కళ్లు తెరిచి ప్రజలను కాపాడటానికి ప్రయత్నించండి. కరోనా వల్ల చనిపోయిన 9వేల మందివి ప్రభుత్వ హత్యలే. […]
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలయికలో రానున్న సినిమా కావటంతో అభిమానుల్లో హడావుడి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జతగా కియారా అద్వానీ నటించబోతోందట. కొరటాల ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు కు జోడిగా కియారా నటించింది. మరోసారి కొరటాల దృష్టి ఆమెపైనే ఉందట. […]
దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. తన సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే ఆక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సోనూ ఫౌండేషన్ కి పలువురు దాతలు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వరికుంటపాడుకి చెందిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి సోనూ ఫౌండేషన్ కి 15వేలు విరాళంగా అందచేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన సోనూసూద్ తన […]
చంద్రబాబు , టీడీపీ నేతలు ,ప్రతిపక్షాల పై మంత్రి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఏపీలో జరుగుతున్నంత నీచ రాజకీయాలు దేశంలో మరెక్కడాలేవు. రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ముఖ్యమంత్రి రుయా ఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన టీడీపీ క్యాండిల్ నిరసన చేపట్టింది. చంద్రబాబుకు , టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా… కడుపుకు అన్నం తింటున్నారా … గడ్డి తింటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పుష్కరాల్లో సుమారు […]
ఎలాంటి విపత్తు వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటానికి ముందుకు వస్తుంటారు సూర్య బ్రదర్స్. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభాగ్యులను చదవిస్తూ… పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా తొలి దశలోనూ ఎంతో మంది బాధితులకు సహాయం అందించిన సూర్య బ్రదర్స్ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన స్టాలిన్ ను కలిసి అభినందించి కోవిడ్ బాధితులును ఆదుకోవాలంటూ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఎన్నికల్లో గెలిచిన స్టాలిన్ ను విశాల్ వంటి పలువురు చిత్రప్రముఖులు కలసి ప్రచారానికి వాడుకుంటుంటే… […]
సూపర్ రజనీకాంత్ కోవీడ్ వాక్సిన్ తీసుకున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ మన తలైవర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక కలసి కట్టుగా పోరాడి కరోనాను జయిద్దాం అన్నారు. అంతే కాదు తప్పని సరిగా మాస్క్ ధరిద్దాం. ఇంట్లోనే ఉందాం. క్షేమంగా ఉందాం అని ట్వీట్ చేశారు. ‘కోవీషీల్డ్’ సెకండ్ డోస్ ను రజనీ తన ఇంట్లోనే తీసుకున్నారు. రోజుల క్రితమే రజనీకాంత్ హైదరాబాద్ లో ‘అన్నాత్తై’ షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. ఈ […]