సూపర్ రజనీకాంత్ కోవీడ్ వాక్సిన్ తీసుకున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ మన తలైవర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక కలసి కట్టుగా పోరాడి కరోనాను జయిద్దాం అన్నారు. అంతే కాదు తప్పని సరిగా మాస్క్ ధరిద్దాం. ఇంట్లోనే ఉందాం. క్షేమంగా ఉందాం అని ట్వీట్ చేశారు. ‘కోవీషీల్డ్’ సెకండ్ డోస్ ను రజనీ తన ఇంట్లోనే తీసుకున్నారు. రోజుల క్రితమే రజనీకాంత్ హైదరాబాద్ లో ‘అన్నాత్తై’ షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కాగానే విదేశాలకు వెళ్లి కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకోనున్నారు రజనీకాంత్.