హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డికి షో కాజ్ నోటీస్ జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ సంఘం.. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా కూడా మారలేదు. దాంతో 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొంది క్రమశిక్షణ సంఘం. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది.